Skip to main content

నాపై నమ్మకంతో మరోసారి రాష్ట్ర అధ్యక్షులు పదవి అప్పగించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు* *పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన యువనేత నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు* *నూతనంగా నియమించబడిన టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు* *తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత* *---- పల్లా శ్రీనివాసరావు*

                      K.V.SHARMA  EDITOR 


నాపై నమ్మకముంచి రెండోసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన నవ్యాంధ్ర శిల్పి, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్టడుగు వర్గాలకు, బీసీలకి రాజకీయంగా అండగా నిలబడటం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం. ఒక బీసీ బిడ్డగా నాకు ఈ స్థాయి గుర్తింపు లభించిందంటే అది చంద్రబాబు గారి దూరదృష్టి, బీసీల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా, సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూనే.. యువతను ప్రోత్సహిస్తూ తెలుగుదేశం పార్టీని భవిష్యత్ తరాలకు ఒక తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా సగర్వంగా తెలుయజేస్తున్నా.


తెలుగుదేశం పార్టీ నవశకానికి వారధిగా, కోట్లాది మంది కార్యకర్తల ఆశల ఆశాకిరణంగా ఎదిగిన యువనేత నారా లోకేష్ గారు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడం హర్షణీయం. తన అసాధారణ పనితీరుతో, చెక్కుచెదరని సంకల్పంతో అటు పార్టీ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని, ఇటు యువతరాన్ని ఏకతాటిపైకి తెచ్చిన లోకేష్ గారి నియామకం.. టీడీపీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నాయకత్వం అంటే కేవలం పదవి కాదు, అంకితభావంతో కూడిన బాధ్యత అని నిరూపించిన ఆయన, రాబోయే రోజుల్లో పార్టీని మరిన్ని విజయ తీరాలకు చేర్చడం ఖాయం. 


టీడీపీలో కార్యకర్తే అధినేత. సామాన్య కార్యకర్తకు కూడా జాతీయ, రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఇచ్చే ఏకైక పార్టీ టీడీపీ అని మరోసారి రుజువైంది. సామాన్య మండల అధ్యక్షురాలిని, క్లస్టర్ ఇంఛార్జీలను పార్టీలో అత్యున్నత కమిటీ అయిన పోలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం హర్షణీయం. జాతీయ, రాష్ట్ర కమిటీల్లో నూతనంగా నియమితులైన నాయకులకు హృదయపూర్వక అభినందనలు. మీరు ఎంపిక కావడం మీ శ్రమ, నిబద్ధత, పార్టీ సిద్ధాంతాలపట్ల ఉన్న అనురాగానికి గుర్తింపు. మీ నాయకత్వం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. తెలుగుదేశం పార్టీ అన్ని స్థాయిల్లో మరింత బలపడుతుందని, ప్రజాసేవలో స్ఫూర్తిని కల్గిస్తుందని ఆశిస్తున్నాను. మీరు చేపట్టబోయే ఈ కొత్త బాధ్యతల్లో విజయం సాధించాలని పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.



Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.