Skip to main content

హిందీ విభాగం ఆధ్వర్యంలో “శతాబ్ది హిందీ సాహిత్య మహోత్సవం”


ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, ఏప్రియ‌ల్ 09: ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగం ఆధ్వర్యంలో “శతాబ్ది హిందీ సాహిత్య మహోత్సవం”  గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం హిందీ విభాగ అధ్యక్షులు  ఆచార్య న‌ల్ల స‌త్య‌నారాయ‌ణ అద్య‌క్ష‌త వ‌హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ    హిందీ భాష, సాహిత్య అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని చెప్పారు. వివిధ డిగ్రీ కళాశాల నుండి వచ్చిన విద్యార్థులు మరియు అధ్యాపకులకు తమ ఆంధ్ర విశ్వవిద్యాలయ కీర్తి ప్రతిష్టలను మరియూ హిందీ విభాగ ప్రాముఖ్యతను విశ్వవిద్యాలయంతో తనకున్న అనుభవాలను తెలియజేశారు. 

ఉదయం వ్యాసరచన పోటీలో  “శైక్షణిక అభివృద్ధిలో పుస్తక మరియు అంతర్జాల జ్ఞాన ప్రాముఖ్యత” మరియు “ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగ అభివృద్ధిలో ఆచార్యుల పాత్ర” అనే అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను లిఖితరూపంలో వ్యక్తపరిచారు. వ‌క్తృత్వ పోటీలో “భాష మరియు సాహిత్య పరంగా విద్యార్థుల భావ వ్యక్తీకరణ” మరియు “ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హిందీ విభాగ పాత్ర” అనే అంశాలపై విద్యార్థులు తమ ప్రసంగాలను అందించారు. అనంత‌రం హిందీ సాహిత్యంపై క్విజ్ పోటీ నిర్వహించారు. ఈ పోటీలలో వివిధ కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


ఈ పోటీల‌లో విజేత‌ల‌కు పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సెమినార్ హాల్లో జరిగిన ముగింపు సభలో హిందీ విభాగాధిపతి ఆచార్య ఎన్. సత్యనారాయణ, విభిగ బిఓఎస్ చైర్మ‌న్‌  ఆచార్య జర్రా అప్పారావు   బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశి అభినందించారు

Comments