అమరావతి:ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పరిస రాల ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది, అర్ధరాత్రి 12: 30 గంటల సమయంలో కొన్ని సెకన్లు పాటు... భూమి కంపించిం దని, స్థానికులు చెబుతు న్నారు. ఎలమంచిలి పట్ట ణంతో పాటు..మండలం లోని పలు గ్రామాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
రాంబిల్లి మండలం పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:30 గంటల సమయం లో ఈ ప్రకంపనలు సంభ వించాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.7గా నమోదైనట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించా రు. నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
అయితే, ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. స్థానిక అధికారులు మరియు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందాలు ప్రకంపనలకు గల కారణా లను విశ్లేషిస్తున్నాయి. ఇలాంటి తక్కువ తీవ్రత గల ప్రకంపనలు సాధా రణంగా ఆందోళన చెందా ల్సిన విషయం కాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment