Skip to main content

అల్లవరంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి వేడుకలు....


అల్లవరం, విశాఖ సందేసం..
..అల్లవరం హైస్కూల్ సెంటర్లో మహాత్మ జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి.ఈ వేడుకలులో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఇళ్ళ శేషగిరిరావు పాల్గొని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపిపి శేషగిరిరావు  మాట్లాడుతూ జ్యోతిరావు పూలే దేశం గర్వించదగ్గ గొప్ప సంఘసంస్కర్తని, అనగారిన వర్గాలు, స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానుభావుడు పూలే అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి నాయకులు యాళ్ళ దొరబాబు,రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యురాలు నిచ్చెనకోళ్ల మౌనిక, చొల్లంగి వెంకటరమణ, కట్టా నారాయణ మూర్తి,అడపా శ్రీను,పితాని శేఖర్, బొక్కా ప్రసాద్, బొక్కా శ్రీను,మామిడి శెట్టి రాజు, కుడుపూడి సామ్రాట్,వాసర్ల సూర్యనారాయణ,సుంకర సాయి,నార్గన శ్రీనివాస్, కాండ్రేగుల వెంకటేశ్వరరావు పితాని చంద్ర శేఖర్,కొల్లు రవి వర్మ,అక్కిశెట్టి వీరభద్రరావు, వాసంశెట్టి సాయి ప్రసాద్, కడలి దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Comments