ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా డాక్టర్ దుర్గాబాయి దేశ్ ముఖ్ సెంటర్ ఆధ్వర్యంలో వనిత వేవ్ 100 పేరిట నిర్వహిస్తున్న నడక కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినిలు పాల్గొని విజయవంతం చేయాలని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్ఎం వి ప్రణవ్ గోపాల్ కోరారు. బుధవారం ఉదయం ఆయన ఛాంబర్ లో ఏయూ ఉమెన్ స్టడీస్ డైరెక్టర్ శ్రీమతి ఆచార్య పల్లవి గారు వనితా వేవ్ నడక లో పాల్గొనాలని ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 న (శుక్రవారం) ఉదయం ఆర్ కే బీచ్ కాళీమాత దేవాలయం నుంచి నడక సాగుతుందని తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. అత్యంత
వైభవంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ఎయు పరిధిలోని అనుబంధ కళాశాల ల కు చెందిన మహిళా సిబ్బంది, విద్యార్థినులు, వివిధ విభాగాల మహిళా ఉద్యోగినులు ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆరోగ్యవంతమైన జీవనానికి నడక అవసరమని, నడక కు ఉన్న ప్రాధాన్యత ను దృష్టి లో ఉంచుకొని ఈ వనితా వేవ్ నడక కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రా యూనివర్సిటీ ఉమెన్ స్టడీస్ డైరెక్టర్ శ్రీమతి ఆచార్య పల్లవి పాల్గొన్నారు.
K.V.SHARMA. EDITOR

Comments
Post a Comment