విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడమే లక్ష్యం. *జీవీఎంసీ ఆదాయ పరిపుష్టికి ప్రత్యేక దృష్టి . జిల్లా కలెక్టర్ ,జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం. అభిషిక్త్ కిషోర్. జీవీఎంసీ ఉన్నతాధికారులతో ప్రత్యేక అధికారి సమీక్ష .
విశాఖపట్నం ఏప్రిల్ 3: విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలక్టరు ఎం. అభిషిక్త్ కిషోర్ అన్నారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశం లో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర జీవీఎంసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా నూతన విశాఖ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి మొదటిసారి జీవీఎంసీ ప్రత్యేక అధికారి హోదాలో జీవీఎంసీ కి విచ్చేసిన జిల్లా కలెక్టర్ ,జీవీఎంసీ ప్రత్యేక అధికారికి జీవీఎంసీ కమిషనర్ తోపాటు అదనపు కమిషనర్లు ఇతర ఉన్నతాధికారులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ విశాఖ నగరం పై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని అందరి దృష్టి విశాఖ పై కేంద్రీకృతమవుతు న్నదని అందుకు మునిసిపల్ యంత్రాంగం అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించి పనిచేయాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న అత్యుత్తమ ప్రాజెక్ట్ ను స్ఫూర్తి గా తీసుకొని విశాఖలో నూతన పనులు ప్రారంభించాలని సూచించారు. అధికారులు నిరంతరం క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలు తెలుసుకొని ప్రజాప్రతినిదుల సూచనల మేరకు పనులు చేపట్టాలని కో రారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ పనులు చేపట్టాలన్నారు. జీవీఎంసీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా సిబ్బంది పనితీరు ఉండాలని పేర్కొన్నారు.
వార్డు సేక్రేటేరియట్ సిబ్బంది పై వస్తున్న ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని వారిపై కటినంగా వ్యవహరించాలని అన్నారు. విశాఖను ప్రపంచంలోనే పరిశుభ్రమైన, నివాశయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరు అంకితభావంతో పనిచేయాలని కలక్టర్ పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ స్థాయికి నగర అభివృద్ధి దిశగా జీవీఎంసీ ఆదాయ పరిపుష్టికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. తదుపరి జీవీఎంసీ కమిషనర్ జీవీఎంసీ విభాగాల వారీగా ఉన్నతాధికారుల పేర్లు , విధులు జీవీఎంసీ ప్రత్యేక అధికారికి పరిచయం చేశారు.తదుపరి ప్రత్యేక అధికారి విభాగాల వారీగా సమీక్షిస్తూ జీవీఎంసీ ఆదాయ వ్యయలపై వ్యయ పరిశీలకులు,, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకొని విశాఖ నగర అభివృద్ధి లక్ష్యంగా జిపిఎంసి ఆర్థిక పరిపుష్టికి అధికారులు కృషి చేయాలన్నారు. నగరాన్ని 7 స్టార్ రేటింగ్ కు తీసుకు వెళ్లడా నికి ,మొదటి ర్యాంక్ కు కోసం కృషి చేయాలని ,సాసా కార్యక్రమంలో ప్రభుత్వ తీమ్ ప్రకారం నెలంతా కార్యక్రమాలు నిర్వహించాలని, డ్రైనేజీ లలో మురుగు నిలువ లేకుండా చూడాలని, ప్రజలకు జారీచేసే బర్త్ , డెత్ సర్టిఫికేట్ విషయంలో సర్వీసులు పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలని ,ఇలాంటివి ప్రజల డోర్ స్టెప్ వద్దకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలన్నారు. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసే వేసవి చలివెంద్రాలలో సియేస్ఆర్ ఫండ్స్ ద్వారా త్రాగునీటి తో పాటు మజ్జిక, ఓఆర్ఎస్ అందించడానికి కృషి చేయాలని అన్నారు.భోగాపురం ప్రారంభం నాటికి రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, ఎక్కడైనా భూ సమస్య ఉంటె జాయింట్ కలక్టర్ తో చర్చించి పరిష్కరించాలన్నారు. తదుపరి ప్రజారోగ్యం పై సమీక్ష నిర్వహిస్తూ నగరంలో పారిశుధ్య నిర్వహణ, క్లాప్ వాహనాలు, పారిశుద్ధ్య కార్మికుల వివరాలు, వ్యర్ధాల సేకరణ, తరలింపు, కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ లోని కంపోస్టు తయారీ, విద్యుత్ ప్లాంటు, బయోగ్యాస్ ప్లాంటు, రీసైకిల్ విధానం, తోపాటు వ్యర్థాల నిర్వహణ , మిద్దె తోటల తో పచ్చదనం అభివృద్ధి, ప్రజా మరుగుదొడ్లు, వెటర్నరీ విభాగం, మలేరియా విభాగం, స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం మొదలైనవి అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో మొదటి ర్యాంకు లక్ష్యంగా అధికారులు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.ఇంజనీరింగ్ విభాగం పై సమీక్షిస్తూ నగరంలో రోడ్లు, కాలువలు, ఇతర పబ్లిక్ వర్క్స్ కు కేటాయించిన బడ్జెట్ వాటి వివరాల తో పాటు భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, పార్కులు, గ్రీన్ బెల్టులు, సెంటర్ మీడియన్ల , పచ్చదనం అభివృద్ధి,నిర్వహణ, పలు ఆధునిక సౌకర్యాలతో కూడిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్స్ , స్మార్ట్ సిటీ కార్పోరేషన్ ద్వారా నిర్వహిస్తున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణం పురోగతి, భోగాపురం ఎయిర్ పోర్టుకు అనుసంధాన రోడ్లు పనుల పురోగతి, పలుచోట్ల చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులు, జీవీఎంసీ స్టేడియంలు, వీధి దీపాలు, తాగునీరు, మెకానికల్ విభాగం, పట్టణ ప్రణాళిక విభాగం, టిడ్కో ఇల్లు నిర్మాణం, అన్న క్యాంటీన్లు నిర్వహణ, మొదలైనవి జీవీఎంసీ కమిషనర్ ప్రత్యేక అధికారికి వివరించారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చలివేంద్రాలు ఏర్పాటుకు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. విశాఖపట్నం ఎంతో సువిశాలమైన అందమైన నగరమని , నగర ప్రజలు విశాఖ నగర అభివృద్ధికి ఎంతో సహకరిస్తారని తెలిపారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థరాష్ట్రంలోని పెద్ద కార్పొరేషన్ అని ప్రజలకు కావలసిన అన్ని సర్వీసులు సకాలంలో అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్లు డి.వి. రమణమూర్తి, ఎస్. ఎస్ .వర్మ, పి.నలనయ్య, జాయింట్ డైరెక్టర్ అమృత్ విజయభారతి, ప్రధాన ఇంజనీరు సత్యనారాయణ రాజు, ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఏ .ప్రభాకర్ రావు, డిసిఆర్ శ్రీనివాసరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్, ఇంచార్జ్ డిడిహెచ్ వాసుకి, వ్యయ పరిశీలకులు సి. వాసు దేవ రెడ్డి, ఇంచార్జ్ స్పోర్ట్స్ డైరెక్టర్ ఇ ఎ రాజు, పర్యవేక్షక ఇంజనీర్లు, ప్రణాళిక అధికారులు, జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ విశాఖ నగరం పై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని అందరి దృష్టి విశాఖ పై కేంద్రీకృతమవుతు న్నదని అందుకు మునిసిపల్ యంత్రాంగం అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించి పనిచేయాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న అత్యుత్తమ ప్రాజెక్ట్ ను స్ఫూర్తి గా తీసుకొని విశాఖలో నూతన పనులు ప్రారంభించాలని సూచించారు. అధికారులు నిరంతరం క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలు తెలుసుకొని ప్రజాప్రతినిదుల సూచనల మేరకు పనులు చేపట్టాలని కో రారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ పనులు చేపట్టాలన్నారు. జీవీఎంసీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా సిబ్బంది పనితీరు ఉండాలని పేర్కొన్నారు. వార్డు సేక్రేటేరియట్ సిబ్బంది పై వస్తున్న ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని వారిపై కటినంగా వ్యవహరించాలని అన్నారు. విశాఖను ప్రపంచంలోనే పరిశుభ్రమైన, నివాశయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరు అంకితభావంతో పనిచేయాలని కలక్టర్ పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ స్థాయికి నగర అభివృద్ధి దిశగా జీవీఎంసీ ఆదాయ పరిపుష్టికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. తదుపరి జీవీఎంసీ కమిషనర్ జీవీఎంసీ విభాగాల వారీగా ఉన్నతాధికారుల పేర్లు , విధులు జీవీఎంసీ ప్రత్యేక అధికారికి పరిచయం చేశారు.తదుపరి ప్రత్యేక అధికారి విభాగాల వారీగా సమీక్షిస్తూ జీవీఎంసీ ఆదాయ వ్యయలపై వ్యయ పరిశీలకులు,, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకొని విశాఖ నగర అభివృద్ధి లక్ష్యంగా జిపిఎంసి ఆర్థిక పరిపుష్టికి అధికారులు కృషి చేయాలన్నారు. నగరాన్ని 7 స్టార్ రేటింగ్ కు తీసుకు వెళ్లడా నికి ,మొదటి ర్యాంక్ కు కోసం కృషి చేయాలని ,సాసా కార్యక్రమంలో ప్రభుత్వ తీమ్ ప్రకారం నెలంతా కార్యక్రమాలు నిర్వహించాలని, డ్రైనేజీ లలో మురుగు నిలువ లేకుండా చూడాలని, ప్రజలకు జారీచేసే బర్త్ , డెత్ సర్టిఫికేట్ విషయంలో సర్వీసులు పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలని ,ఇలాంటివి ప్రజల డోర్ స్టెప్ వద్దకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలన్నారు. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసే వేసవి చలివెంద్రాలలో సియేస్ఆర్ ఫండ్స్ ద్వారా త్రాగునీటి తో పాటు మజ్జిక, ఓఆర్ఎస్ అందించడానికి కృషి చేయాలని అన్నారు.భోగాపురం ప్రారంభం నాటికి రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, ఎక్కడైనా భూ సమస్య ఉంటె జాయింట్ కలక్టర్ తో చర్చించి పరిష్కరించాలన్నారు. తదుపరి ప్రజారోగ్యం పై సమీక్ష నిర్వహిస్తూ నగరంలో పారిశుధ్య నిర్వహణ, క్లాప్ వాహనాలు, పారిశుద్ధ్య కార్మికుల వివరాలు, వ్యర్ధాల సేకరణ, తరలింపు, కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ లోని కంపోస్టు తయారీ, విద్యుత్ ప్లాంటు, బయోగ్యాస్ ప్లాంటు, రీసైకిల్ విధానం, తోపాటు వ్యర్థాల నిర్వహణ , మిద్దె తోటల తో పచ్చదనం అభివృద్ధి, ప్రజా మరుగుదొడ్లు, వెటర్నరీ విభాగం, మలేరియా విభాగం, స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం మొదలైనవి అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో మొదటి ర్యాంకు లక్ష్యంగా అధికారులు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.ఇంజనీరింగ్ విభాగం పై సమీక్షిస్తూ నగరంలో రోడ్లు, కాలువలు, ఇతర పబ్లిక్ వర్క్స్ కు కేటాయించిన బడ్జెట్ వాటి వివరాల తో పాటు భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, పార్కులు, గ్రీన్ బెల్టులు, సెంటర్ మీడియన్ల , పచ్చదనం అభివృద్ధి,నిర్వహణ, పలు ఆధునిక సౌకర్యాలతో కూడిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్స్ , స్మార్ట్ సిటీ కార్పోరేషన్ ద్వారా నిర్వహిస్తున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణం పురోగతి, భోగాపురం ఎయిర్ పోర్టుకు అనుసంధాన రోడ్లు పనుల పురోగతి, పలుచోట్ల చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులు, జీవీఎంసీ స్టేడియంలు, వీధి దీపాలు, తాగునీరు, మెకానికల్ విభాగం, పట్టణ ప్రణాళిక విభాగం, టిడ్కో ఇల్లు నిర్మాణం, అన్న క్యాంటీన్లు నిర్వహణ, మొదలైనవి జీవీఎంసీ కమిషనర్ ప్రత్యేక అధికారికి వివరించారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చలివేంద్రాలు ఏర్పాటుకు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. విశాఖపట్నం ఎంతో సువిశాలమైన అందమైన నగరమని , నగర ప్రజలు విశాఖ నగర అభివృద్ధికి ఎంతో సహకరిస్తారని తెలిపారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థరాష్ట్రంలోని పెద్ద కార్పొరేషన్ అని ప్రజలకు కావలసిన అన్ని సర్వీసులు సకాలంలో అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్లు డి.వి. రమణమూర్తి, ఎస్. ఎస్ .వర్మ, పి.నలనయ్య, జాయింట్ డైరెక్టర్ అమృత్ విజయభారతి, ప్రధాన ఇంజనీరు సత్యనారాయణ రాజు, ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఏ .ప్రభాకర్ రావు, డిసిఆర్ శ్రీనివాసరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్, ఇంచార్జ్ డిడిహెచ్ వాసుకి, వ్యయ పరిశీలకులు సి. వాసు దేవ రెడ్డి, ఇంచార్జ్ స్పోర్ట్స్ డైరెక్టర్ ఇ ఎ రాజు, పర్యవేక్షక ఇంజనీర్లు, ప్రణాళిక అధికారులు, జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment