విశాఖపట్నం వన్ టౌన్ ప్రాంతంలో 149 సంవత్సరాల చరిత్ర గల కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఈనెల 26వ తేదీనాడు *వైశాఖ శుద్ధ దశమి* సందర్భంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారి 1076వ జయంతి మహోత్సవమును ఘనంగా నిర్వహించుచున్నట్లు దేవాలయ సంఘ అధ్యక్షులు శ్రీ అరిశెట్టి దినకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు తెల్లవారుజామున ఐదు గంటలకు సుప్రభాత సేవతో మొదలై 108 ద్రవ్యములతో ప్రత్యేక క్షీరాభిషేకం, అమ్మవారికి రజితవస్త్రాలంకరణ, 108 స్వర్ణపుష్పములతో ప్రత్యేక పూజా కార్యక్రమం, సహశ్రనామార్చన, 102 మంది మహిళలచే సామూహిక కుంకుమ పూజలు మరియు వాసవి మూలమంత్రహోమం, మహిళలచే సామూహిక కుంకుమార్చన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం 12 గంటలకు పేదలకు అన్నదానం (అన్న సమారాధన) నిర్వహించుచున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆ రోజు సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో నాట్యదీపిక కూచిపూడి అకాడమి శ్రీమతి ఇంద్రాణి రెడ్డి బృందం వారిచే నృత్య ప్రదర్శన ఘనంగా నిర్వహించుచున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమమునకు సంబంధించిన కరపత్రం కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శనివారం

నాడు జరిగిన దేవాలయ ప్రతినిధుల సమావేశంలో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ గ్రంధి రాజేష్ chairman, Integral Estates. Visakhapatnam మరియు శ్రీమతి వంకాయల సాయి నిర్మల, District Governor, Vasavi Club International V201 గారి అమృత హస్తములతో విడుదల జేశారు.
ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి పెనుగొండ కామరాజు, కోశాధికారి శ్రీ దోమ వెంకట బాలాజీ కుమార్, కార్యక్రమ నిర్వహకులు శ్రీయుతులు పాలూరి సురేష్ కుమార్, సుగ్గుశివ కుమార్, కడిమిశెట్టి వెంకటరమణ, పాలూరి వర ప్రసాద్, కొత్తా అరుణ్ కుమార్, సివిఎన్ రామకృష్ణ తదితరులు
పాల్గొన్నారు. అమ్మవారి జయంతి పర్వదిన సందర్భంగా నిర్వహించు కార్యక్రమములలో నగరంలోని ఆర్యవైశ్యులు అందరూ పాల్గొని అమ్మవారి కృపాకటాక్షములు, తీర్థప్రసాదములు గైకొనాలని కోరారు.
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment