స్టేడియoలలో యూజర్స్ చార్జీలు రద్దు చేయకుంటే ఉద్యమిస్తాం!* *క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది* * *వైసీపీ హయాంలో ఫ్రీ గా సేవలందించాం*.. * *మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్*
మహా విశాఖ నగర పాలక సంస్థ ఆధీనంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వంటి స్టేడియంలో క్రీడాకారులపై యూజర్ చార్జీల వసూలు చర్యలు ఉపసంహరించాలని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వైసీపీ శ్రేణులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వ ఆదేశాలతో వివిధ క్రీడా శిక్షణలు పొందే విద్యార్థులు, క్రీడలు ఆడుకునే వారిపై రూ.12,000 నుండి రూ.15,000 వరకు యూజర్ చార్జీల వసూలుకు ప్రయత్నం చేస్తున్నారని, ఇవి ప్రజా వ్యతిరేకమైనదన్నారు. ఆరోగ్య రక్షణ సదుపాయాలు, సేవలు, క్రీడా మైదానాలు, ఇండోర్ స్టేడియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, పార్కుల్లో కల్పించాల్సిన బాధ్యత
జీవీఎంసీదేనన్నారు. వైసిపి హయంలో క్రీడాకారులకు ఆరోగ్య పరిరక్షణకు వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత అందించి ఉచిత సేవలు అందించిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నడక మీద కూడా పన్నులు వేయడం విడ్డూరమన్నారు. ప్రజల ఆస్తిగా ఉండాల్సిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను చంద్రబాబు ప్రైవేట్ సంస్థగా మార్చేశారన్నారు. కాంట్రాక్టర్ చెల్లించాల్సిన రూ.2 కోట్లు లీజు కూడా చెల్లించకుండా నిరాకరించినా, అధికార కూటమి ప్రభుత్వ వత్తిడి వల్ల జీవీఎంసీ ఏ చర్యా తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉందని అన్నారు. వెంటనే వ్యాయామ, క్రీడాకారులపై విధించిన ఫీజులు ఉపసంహరించాలని లేని పక్షంలో వైసిపి హయంలో మహా ఉద్యమ పోరాటం చేస్తామని వాసుపల్లి హెచ్చరించారు. కార్యక్రమంలో 35వ వార్డు వైసీపీ అధ్యక్షుడు కనకారెడ్డి, జిల్లా బీసీ విభాగం ప్రెసిడెంట్ సనపల రవీంద్ర , స్టేట్ సంస్కృతి విభాగం స్టేట్ సెక్రటరీ కే. సాగర్, 38 వ వార్డు యూత్ ప్రెసిడెంట్ చేపల నూక రాజు తదితరులు పాల్గొన్నారు
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment