భారతీయ జనతా పార్టీ జనతా వారధి ఉత్తరాంధ్ర కార్యాలయంలో వినతులు స్వీకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్*
ఈరోజు 17-04-2026 శుక్రవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారి ఆధ్వర్యంలో జనతా వారధి ఉత్తరాంధ్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారు ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా శ్రీ PVN మాధవ్ మాట్లాడుతూ ప్రజలకు ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలను అర్జీలను స్వీకరించి ఈ జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ జనతా వారధి కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఒక MLA అందుబాటులో ఉంటూ ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి M నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర ST మోర్చా ప్రధాన కార్యదర్శి SRLN మురళి మోహన్ రాజు, జనతా వారధి కో కన్వీనర్ మూల వెంకటరావు, బీజేపీ రాష్ట్ర SC మోర్చా ఉపాధ్యక్షురాలు కట్ట పద్మ పాటు పలువురు కార్య`కర్తలు పాల్గొనడం జరిగింది
K.V.SHARMA EDITOR


Comments
Post a Comment