రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు శ్రీమతి నిషిధా రాజు గారి, జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామ రాజు గారు, ఆదేశాల మేరకు,
విశాఖపట్నం ఏప్రిల్ -19 :మహిళా మోర్చా అధ్యక్షురాలు నాదెళ్ల జ్యోతి గారి ఆధ్వర్యంలో మహిళల హక్కులను పూర్తిగా తుంచివేసే విధంగా విఫలమైన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంలో విపక్షాలు వ్యవహరించిన తీరును ఖండిస్తూ పత్రికా సమావేశం నిర్వహించడం అయినది.
మహిళల సాధికారతకు మూలస్తంభమైన ఈ బిల్లును కావాలనే అడ్డుకోవడం మహిళలపై జరిగిన అన్యాయం మాత్రమే కాకుండా, వారి ఆశలు, ఆకాంక్షలపై నేరుగా చేసిన దాడిగా మేము భావిస్తున్నాము. మహిళల అభివృద్ధిని అడ్డుకునే ఈ విధమైన రాజకీయ ధోరణిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని,
మహిళల హక్కులను దెబ్బ తీసే విధంగా పార్లమెంట్లో వ్యవహరించిన పార్టీల నిర్ణయం పై తీవ్రంగా మండిపడుతూ, రాబోయే రోజుల్లో మరింత బలమైన పోరాటాలకు సిద్ధమవుతున్నామని తెలియజేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి రోహిణి గారు, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు లలిత గారు, జిల్లా మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ స్పందన గారు పాల్గొని తమ గట్టి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment