Skip to main content

విశాఖ ఆర్.కె. బీచ్ నందు గల అంబేద్కర్ విగ్రహం నుండి,బిజెపి SC మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన బాబాసాహెబ్ డా.బి ఆర్ అంబేడ్కర్ గారి 135వ జయంతి వారోత్సవాల్లో భాగంగా "3K సమరసత మారథాన్" ఏర్పాటు చేయడం జరిగినది.

 


విశాఖపట్నం ఏప్రిల్  -19 :ఈ సమరసత మారధాన్ లో పాల్గొన వారిలో విజేతలకు బిజెపి జిల్లా అధ్యక్షులు పరశురామ్ రాజుగారు, రాష్ట్ర ఎస్సీ మోత్చార్ అధ్యక్షులు,పానతల సురేష్ మరియు రాష్ట్ర కార్యదర్శి సురేంద్రమోహన్ చేతుల మీదుగా ప్రైజ్ మనీ తో పాటు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పానతల సురేష్ మాట్లాడుతూ...


మన ఊపిరిలో సమరసత... మన పరుగులో జాతీయత" అనే నినాదంతో విశాఖలో నినాదాలతో "సమరసత మారథాన్"  విశాఖవాసులు పాల్గొన్నారు అని,

"కులం, మతం అనే భేదాలు లేకుండా అందరం కలిసి ఐక్యత తో కలసి సాగాలని, ఇదే బాబాసాహెబ్ కి నిజమైన ఘన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమం లో బిజెపి sc మోర్చా ప్రధాన కార్యదర్శి గణిరెడ్డి రాకేష్,sc మోర్చా జిల్లా అధ్యక్షులు M ప్రకాష్,kvnp చక్రవర్తి, రాష్ట్ర మరియు జిల్లా పదాధికారులు, వివిధ మోర్చా అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు స్థానికులు పాల్గొనడం జరిగింది.

                  K.V.SHARMA  EDITOR 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.