విశాఖపట్నం - ఏప్రిల్ -04 భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ ఏమ్ ఏమ్ ఎన్ పరుశురామరాజు గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి చీఫ్ మాధవ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ఓటర్ల పేర్లు చేర్చటం, అనర్హుల పేర్లను తొలగించడం, తప్పులను సరిదిద్దడం ద్వారా ఖచ్చితమైన మరియు నమ్మదగిన ఓటర్ల జాబితాని తయారు చేయడానికి జరిగే ఒక సమగ్ర సవరణ ప్రక్రియ.
ఎస్ఐఆర్ జరిగిన రాష్ట్రాలలో లక్షల కొలది అనర్హులను గుర్తించడం జరిగినది
చొరబాటుదారులు దేశవ్యాప్తంగా సుమారుగా 6 కోట్ల మంది ఉన్నారని వారికి గత ప్రభుత్వ హయాంలో ఆధార్ మరియు ఓటర్ కార్డులను పొందారని తెలియజేశారు.
భారతదేశ పౌరులకు, అర్హులకు చెందవలసిన సంక్షేమ పథకాలను చొరబాటు దారులు పొందుతున్నారని మరియు దేశ వ్యతిరేక చర్యలకి కూడా వారు పాల్పడుతున్నారని అన్నారు. ఎస్ఐఆర్ ద్వారా ఇటువంటివారిని సమగ్రంగా తొలగించడం జరుగుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐఆర్ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ కే సురేంద్రమోహన్, రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి సుజాత, రాష్ట్ర కోశాధికారి ఎం నాగేంద్ర, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్



Comments
Post a Comment