ప్రపంచ మలేరియా దినొత్సవము ( World Malaria Day) జారీ చేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది: 23.04.2026
ఏడాది ఏప్రిల్ 25 న ప్రపంచ మలేరియా దినొత్సవము 2008 నుండి కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు జరుపుకుంటున్నాము. అదే విధముగా ఈ సంవత్సరం 2026 “మలేరియా నిర్మూలనదిశగా” ఇప్పుడు మనం సాధించగలం... ఇప్పుడు మనం తప్పక సాధించాలి... అనే ముఖ్య నినాదముతో ప్రపంచ మలేరియా దినొత్సవమును జరుపుకోవలిసిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగినది. దీని ముఖ్య ఉద్దేశ్యం మలేరియా వ్యాప్తిని అరికట్టడం, వ్యాధి నిర్మూలించడం, మరియు ప్రజలలో వ్యాధి పట్ల అవగాహన కల్పించడం దోమల నియంత్రణ, మలేరియా రహిత ప్రపంచం కోసం కృషి చేయడం. ఈ రోజున ప్రభుత్వాలు,ఆ సంస్థలు మలేరియా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు గురించి ప్రజలకు వివరిస్తారు. ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం రోజున పంచాయతీ, మున్సిపల్, అంగన్వాడీ, విద్య, ఇతర డిపార్ట్మెంట్ ల వారు సహకారం తో ర్యాలీ లు, గ్రూప్ మీటింగ్లు, అవగాహన సదస్సులు నిర్వహిస్తారు.
తదుపరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి.జగదీశ్వర రావు వారు ప్రపంచ మలేరియా దినోత్సవం బ్యానర్ ను ఆవిష్కరించారు
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి.జగదీశ్వర రావు వారు మాట్లాడుతూ మలేరియా వ్యాధి ప్లాస్మోడియం అనే పరాన్న జీవి వలన వస్తుంది. ఆడ ఎనాఫిలాస్ అనే దోమ కుట్టడం వలన ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. తీవ్రమైన తలనొప్పి, వొళ్ళు నొప్పులు, చలి, వణుకుతో కూడిన జ్వరం, రోజు విడిచి రోజు జ్వరం రావడం, చెమటలు పట్టడం, వాంతులు వికారం వంటివి మలేరియా లక్షణాలు కాగా, జ్వరం ఉన్న వాళ్ళు ప్రాదమిక ఆరోగ్య కేంద్రాలలోను, ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలోను, ఆరోగ్య కార్యకర్తల వద్ద రక్త పరీక్ష చేయించుకొని వ్యాధిని నిర్ధారించుకోవాలి. పూర్తి చికిత్స తీసుకోవాలి. మలేరియా వ్యాధి దోమల ద్వారా వ్యాపిస్తుంది కావున దోమలు పెరగకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. దోమతెరలు అందరు వాడాలి. ఇంటి లోపల, బయటా నీటి నిల్వలు లేకుండా చూడాలి. ఉన్న నీటి నిల్వలు వారానికి ఒకసారి ఖాళీ చేసి ఆరబెట్టాలి. తాగి పారేసిన కొబ్బరి బొండాలు, టీ కప్పులు, వాడి పారేసిన టైర్లు, రుబ్బు రోళ్ళు, ప్లాస్టిక్ పాత్రల్లో దోమల లార్వా పెరిగే అవకాశం ఉంది. ఫ్రిడ్జ్ లు, ఎయిర్ కూలర్లు, ఫ్లవర్ వాజ్ లు దోమల ఉత్పత్తి వనరులుగా ఉన్నందున ప్రజలు వాటిల్లో నీటిని ప్రతీ మూడు రోజులకు ఖాళి చేయాలి. ప్రజలంతా దోమల నివారణ చర్యలలో భాగస్వామ్యులు కావాలని తద్వారా మలేరియా నివారణకు పాటు పడగలరని కోరుచున్నాము.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా పి జగదీశ్వర రావు వారు మరియు జిల్లా మలేరియా అధికారి శ్రీ జి.వర ప్రసాద రెడ్డి, అసిస్టెంట్ మలేరియా అధికారులు, ఇతర మలేరియా సిబ్బంది పాల్గొన్నారు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,
విశాఖపట్నం.
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment