Skip to main content

జీవీఎంసీలో 14 మంది ఉద్యోగుల ఉద్యోగ విరమణ* *ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు శేష జీవితం ఆనందంగా గడపండి* *జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణ మూర్తి*


విశాఖపట్నం :
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థలో ఎంతో బాధ్యతగా సుదీర్ఘకాలం ఉద్యోగ విధులు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ పొందుతున్న ప్రతి ఒక్కరి ఉద్యోగి శేష జీవితం ఆనందదాయకంగా ఉండాలని కోరుకున్నట్లు జీవీఎంసీ అదనపు కమిషనర్ డి . వి.రమణమూర్తి పేర్కొన్నారు. గురువారo ఆయన మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ లో వివిధ హోదాలలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగులను జీవీఎంసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి. పద్మజ లతో కలిసి సన్మానించారు.


ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి తన ఉద్యోగ కాలంలో తన కుటుంబము కంటే  అధిక కాలాన్ని సంస్థ కొరకు పని చేశారని పేర్కొన్నారు. నేడు ఉద్యోగ విరమణ పొందుతున్న 14 మందిలో జీవీఎంసీ అసిస్టెంట్ ప్లానర్ కె.వెంకటరావుతో పాటు ఫార్మాసిస్ట్ కె. సత్యవేణి, మజ్దూర్, ముగ్గురు పీహెచ్ వర్కర్లు, డ్రైవర్, ఆరుగురు ఎం టి ఎస్ ఉద్యోగులు, ఫిట్టర్ హెల్పర్ మొత్తం 14 మంది ఉద్యోగుల శేష జీవితాలు ఆనందదాయకంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగులందరూ సుదీర్ఘకాలం జీవీఎంసీ కి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. ఉద్యోగ విరమణ పొందుతున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాపకంతో ఆనందంగా జీవిస్తూ శేష జీవితం ఆనందదాయకంగా ఉండాలని తెలిపారు. 


అనంతరం ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ 97 లక్షల 80 వేల రూపాయలను వారికి అందించి పూలమాలలతో సత్కరించి, నూతన వస్త్రాలను, జ్ఞాపికలను అందించి అభినందనలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జెమ్స్ అసోసియేషన్ ప్రతినిధి సన్నీ, పర్యవేక్షకులు పైడిరాజు, గణేష్ , ఇతర జెమ్స్ యూనియన్ నాయకులు, జివిఎంసి ఉద్యోగులతో పాటు మాజీ ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

                    K.V.SHARMA EDITOR 

Comments