జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 18.05.2026
ఈ రోజు అనగా తేది 18.05.2026 న ప్రపంచ హైపర్‌టెన్షన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గౌరవ జి.విద్యాదరి ఐఏఎస్ వారి సమక్షంలో డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి అధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మూడు వైద్య బృందాలు పాల్గొని కలెక్టరేట్ సిబ్బంది మరియు పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు రక్తపోటు పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది, పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమానికి హాజరైన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించబడతాయని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా వైద్య బృందాలు అధిక రక్తపోటు వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, క్రమం తప్పకుండా బీపీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించాయి. ఉప్పు వినియోగాన్ని తగ్గించడం, వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిడిని నియంత్రించడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వంటి సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది, పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమానికి హాజరైన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించబడతాయని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డా.కె.అప్పారావు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ జిల్లా సమన్వయకర్త, డా.బి.హారిక, ఆర్.బి.ఎస్.కె. జిల్లా సమన్వయకర్త, మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment