ఆర్గానిక్ మ్యాంగో మేళా ప్రారంభం ప్రారంభించిన 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్ రకరకాల వెరైటీలతో ఆకట్టుకుంటున్న మేళ
విశాఖపట్నం:, మే 28 రకరకాల వెరైటీలు, విభిన్న రుచులతో విశాఖ వాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఆర్గానిక్ మ్యాంగో మేళ గురువారం సాయంత్రం ప్రారంభమైంది. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నేతృత్వంలో లాసెన్సుబే కాలనీ కామత్ హోటల్ పక్కన ఉన్న బిజెపి కార్యాలయం ఆవరణలో ఈ మేళాను రాష్ట్ర 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ ప్రారంభించారు.
20 స్టాళ్లతో ప్రారంభమైన ఈ మేళా విశాఖ వాసుల మామిడి దాహార్తిని తీర్చనుందని ఈ సందర్భంగా లంకా దినకర్ అన్నారు. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో ఎరువులు, రసాయనాలు, క్రిమిసంహారక మందులు లేకుండా ప్రకృతి పరంగా పండించిన మామిడి అందుబాటులోకి రావడం విశాఖ వాసుల అదృష్టమని పేర్కొన్నారు. ఈ మామిడిని పండించడానికి కూడా ఎటువంటి కెమికల్స్ వాడకపోవడం నిజంగా మంచి పరిణామం అని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి దోహదం చేస్తుందని అన్నారు.
ఎన్నో రకాలుగురువారం ప్రారంభమైన ఈ మేళ శుక్ర శని ఆదివారాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుందని గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ చెప్పారు. ఈ మేళాలో బంగినపల్లి, సువర్ణరేఖ, రసాలు ,ఇమామ్ పసంద్, అమృతం, స్వాగతం, చిలుకలు మామిడి, పంచదార కలిసా, మల్లిక, కొబ్బరి మామిడి, దసేరి , పలుకులు, జహంగీర్ , ఆల్ఫా న్సో, మియాజాకి, పలు నాటు వెరైటీలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ పూర్తిగా సేంద్రయంగా పండించినవేనని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నగర అధ్యక్షుడు పరుశురామరాజు మాట్లాడుతూ, సేంద్రియ మామిడి పళ్ళమేళా కు బిజెపి కార్యాలయం వేదిక కావడం హర్షనీయమని అన్నారు . విశాఖ నగర ప్రజల ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అశోక్ కుమార్, వ్యవసాయల సంఘం కార్యదర్శి సవ్వాకుల అశోక్ , వ్యవసాయదారుల సంఘం రాష్ట్ర నాయకుడు పీ ఎల్ ఎన్ రాజు, మామిడి పంట నిపుణుడు అప్పాజీ, పలు మామిడి రకాల అభివృద్ధి చేసిన రైతు శాస్త్రవేత్త కొంగర రమేష్ తదితరులు పాల్గొన్నారు
D.S.Varma Sr Sub EDITOR




Comments
Post a Comment