Skip to main content

చదువులమ్మ చెట్టు నీడలో 2004 పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక..... అలనాటి మధుర జ్ఞాపకాల ఉత్సహ ఖేలి...

 


అమలాపురం, విశాఖ సందేసం....అ విద్యార్థులు విద్యను అభ్యసించి రెండు దశాబ్దాలు గడిచిన అలనాటి మధుర జ్ఞాపకాల ఉత్సహ ఖేలితో అమలాపురం మహాత్మా గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాలైన  చదువులమ్మ చెట్టు నీడలో 2004 పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగింది.


అమలాపురం మహాత్మా గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు అదే చదువులమ్మ చెట్టు నీడన మరోసారి కలుసుకున్నా క్షణాలు ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి.


 2004  సంవత్సరంలో   పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 22 ఏళ్ల అనంతరం కలుసుకుని అలనాటి తీపి గుర్తులను  గుర్తు చేసుకుని ఆనందోత్సాహాలతో అట పాటలతో ఉల్లాసంగా  గడిపారు. తమ ఉన్నతికి ఎంతో కృషిచేసిన గురువులకు పూలమాలలు వేసి పుష్పగుచ్చాలను అందజేసి  దుస్సాలవాలు కప్పి ఘనంగా  సత్కరించారు. నూతన ఉత్సాహాన్ని నింపే 


ఈ అపూర్వ  కలయికను  ప్రతి సంవత్సరం  జరగాలని కోరుకుంటూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన స్నేహితులను ఆనంద భాష్పాలతో  వారి గమ్యాస్థానాలకు సాగనంపారు.

              Srinivas Spl Correspondant 

Comments