ట్రెండ్ సెట్ చేసిన మహానాడు–2026… గిన్నిస్ స్థాయిలో విజయం సాధిస్తుందని ముందే చెప్పా, అంచనాలకు మించి చరిత్ర సృష్టించింది* *▪️ ‘కార్యకర్తే అధినేత’ నినాదాన్ని సాకారం చేసిన తెలుగు తమ్ముళ్లకు పల్లా పాదాభివందనం* *▪️ మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్‌తో మరో విప్లవాత్మక నిర్ణయం… లోకేష్ ప్రతిపాదనకు మహానాడు సంపూర్ణ మద్దతు* - టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు*
అమరావతి, మే 29:* మహానాడు-2026 ఘన విజయంపై హర్షం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు... ఈ మహానాడు గిన్నిస్ రికార్డు స్థాయిలో విజయవంతం అవుతుందని తాను ముందుగానే చెప్పానని, అయితే తన అంచనాలకు మించి కార్యకర్తలు చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక రాజకీయ సమావేశం కాదని... తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అంకితభావం, క్రమశిక్షణ, సాంకేతికత పట్ల ఉన్న అవగాహన, పార్టీపై ఉన్న ప్రేమకు ప్రతీకగా నిలిచిందన్నారు.
దేశ రాజకీయ చరిత్రలోనే ఒక ప్రాంతీయ పార్టీ నిర్వహించిన అతిపెద్ద డిజిటల్ రాజకీయ మహాసభగా మహానాడు-2026 నిలిచిందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. 1,875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా... 24.50 లక్షల మంది వర్చువల్‌గా భాగస్వామ్యం కావడం ద్వారా మహానాడు సరికొత్త రికార్డులు సృష్టించిందన్నారు. పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచ రాజకీయ పార్టీలకు సైతం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
*కార్యకర్తలే తెలుగుదేశం అసలైన బలం*
1982లో పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీని మోసింది, మోస్తోంది, భవిష్యత్తులో మోయబోయేది కార్యకర్తలేనని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా సిద్ధాంతం కోసం, జెండా కోసం, నాయకత్వం కోసం ప్రాణాలు సైతం అర్పించే కార్యకర్తల సైన్యం తెలుగుదేశం పార్టీ సొంతమని కొనియాడారు.
గత ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనలో వేధింపులు, అక్రమ కేసులు, ఆర్థిక నష్టాలు ఎదురైనా పార్టీ జెండాను వదలకుండా నిలిచిన ప్రతి కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నామని అన్నారు. మెడపై కత్తి పెట్టినా “జై తెలుగుదేశం” అని ప్రాణత్యాగం చేసిన కార్యకర్తల త్యాగాల పునాదులపైనే ఈ పార్టీ నిలిచిందన్నారు.
*కార్యకర్తే అధినేత… చంద్రబాబు ఆచరణలో చూపిన నాయకత్వం*
పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు మరోసారి “కార్యకర్తే అధినేత” అన్న నినాదాన్ని ఆచరణలో చూపించారని పల్లా తెలిపారు. కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లకు పైగా ఖర్చు చేయడం, వారి కుటుంబాల విద్య, నైపుణ్యాభివృద్ధి, సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయడం చంద్రబాబు నాయకత్వ ప్రత్యేకత అని పేర్కొన్నారు.
*డిజిటల్ రాజకీయాలకు నారా లోకేష్ కొత్త నిర్వచనం*
హైబ్రిడ్ మహానాడును విజయవంతంగా నిర్వహించడం వెనుక పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కృషి విశేషమని పల్లా కొనియాడారు. సాంకేతికతను రాజకీయ వ్యవస్థతో అనుసంధానం చేస్తూ ప్రతి కార్యకర్తను నేరుగా నాయకత్వంతో కలిపిన ఈ విధానం దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు.
*మహిళలకు 33 శాతం రిజర్వేషన్… మహానాడు లో చారిత్రాత్మక నిర్ణయం*
మహానాడు-2026లో తీసుకున్న అత్యంత విప్లవాత్మక నిర్ణయాల్లో మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్ ఒకటని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ఎన్టీఆర్ గారు పునాది వేయగా, చంద్రబాబు గారు ఆర్థిక స్వావలంబన కల్పించారని, ఇప్పుడు నారా లోకేష్ మహిళలను నేరుగా రాజకీయ నిర్ణయాధికార కేంద్రంలోకి తీసుకువచ్చే చారిత్రాత్మక నిర్ణయం ప్రతిపాదించారని అన్నారు.
దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ల గురించి చర్చలు జరిగినా... ఒక రాజకీయ పార్టీ తన సంస్థాగత నిర్మాణంలో, ఎన్నికల రాజకీయాల్లో 33 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తామని ప్రకటించడం గొప్ప సంస్కరణ అని పేర్కొన్నారు. ఇది కేవలం రిజర్వేషన్ కాదని... మహిళలకు రాజకీయ అధికారం పంచిపెట్టే నిర్ణయమని అభివర్ణించారు.
*21 తీర్మానాలు… భవిష్యత్ కార్యాచరణకు మార్గదర్శనం*
మహానాడు వేదికగా 21 కీలక తీర్మానాలు ఆమోదించామని, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం నుంచి మహిళా సాధికారత, యువత ఉపాధి, బీసీల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సాంకేతిక అభివృద్ధి వరకు అన్ని అంశాలపై విస్తృత చర్చ జరిగిందని తెలిపారు. 88 మంది నాయకులు, కార్యకర్తలు వివిధ తీర్మానాలపై ప్రసంగించడం మహానాడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు.
*మహానాడు విజయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి*
మహానాడు విజయంతో ప్రయాణం ముగియలేదని, ఇక్కడ తీసుకున్న తీర్మానాలు, ప్రభుత్వ విజయాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
మహానాడు-2026ను ఘన విజయవంతం చేసిన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, నాయకులు, కార్యకర్తలు, సాంకేతిక బృందాలు, ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పల్లా శ్రీనివాసరావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment