Skip to main content

జారీ చేసినవారు డా పి జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేదీ: 23.05.2026



 రోజు అనగా తేదీ 23.05.2026 న డా. పి జగదీశ్వర రావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విశాఖపట్నం వారు పత్రికా ముఖంగా తెలియచేస్తూ

** “క్రమం తప్పకుండా రక్తపోటు పరీక్ష చేయించుకోండి… నిశ్శబ్ద హంతకుడిని జయిద్దాం.”

“కలసికట్టుగా రక్తపోటును నియంత్రిద్దాం… ”

ప్రపంచ రక్తపోటు దినోత్సవం 2025 సందర్బంగా జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించారని తెలియచేశారు.


వరల్డ్‌ హైపర్‌టెన్షన్‌ డే'. అధిక రక్తపోటుపై అందరికీ అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది మే 17న ప్రపంచ హైపర్‌టెన్షన్‌ డేను నిర్వహిస్తున్నారని, రక్తపోటు సాదారణ స్థాయి కంటే పెరగడాన్నే హైపర్‌‌ టెన్షన్  అంటారు  ఇది 'సైలెంట్ కిల్లర్' వ్యాధి . ‌టెన్షన్‌, హైపర్ .. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు, చూపు కోల్పోవడం, మానసిక సమస్యలకు దారితీస్తుంది.  అధిక రక్తపోటు అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం ఈ నేపథ్యంలో హైబీపీని నియంత్రణలో ఉంచుకోవడానికి రోజు మందులు వాడుతూనే.. మనం తీసుకునే ఆహారంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుక ారాలు మన రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 


మనిషి మనుగడకు హృదయ స్పంద లా కొట్టుకుంటున్న సమయంలో.. ఓ దశలో గుండె ముడుచుకు పోయినప్పుడు రక్తం ఒక్క ఉదుటున ముందుకు దూకుతుంది సమయంలో సహజంగానే రక్తపోటు అధికoగా ఉంటుంది దీనినే ‘సిస్టాలిక్‌ ప్రెషర్‌’ అంటారు.ఈ పోటు విలువ 100 నుంచి 140mm Hg (మిల్లీమీటర్‌ ఆఫ్‌ మెర్క్యురీ) మధ్యలో ఉంటే దాన్ని సాధారణ రక్తపోటుగా పరిగణిస్తారు. గుండె వ్యాకోచించినప్పుడు లేదా వికసించుకున్నప్పుడు రక్తప్రవాహ పీడనం తక్కువగా ఉంటుంది. దీన్నే ‘డయస్టాలిక్‌ ప్రెషర్‌’ అంటారు ఇందులో పీడనం 60-90లోపు ఉంటే సాధారణ స్థాయిగా భావిస్తారు గతంలోఆరోగ్యవంతుల రక్తపోటును 120/80 గా పరిగణించేవారు మారుతున్న పరిస్థితుల ఆధారంగా 140/90ని సాధారణ రక్తపోటుగా నిర్ధారించారు . ఇంతకంటే ఎక్కువగా ఉంటే హైపర్‌ టెన్షన్‌తోబాధపదాటున్నట్లు  లెక్క.


ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు మరియు సంబంధిత వైద్యాధికారులు క్రింది శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక ఎన్‌సీడీ స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించారు 

• పోలీస్ స్టేషన్లు – పోలీసు సిబ్బందికి 

• బస్ స్టేషన్లు – ఏపీఎస్‌ఆర్టీసీ సిబ్బందికి 

• రైల్వే స్టేషన్లు – రైల్వే సిబ్బందికి 

• ఇతర సచివాలయ / ప్రభుత్వ ఉద్యోగులుకి 


జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ఆరోగ్య శిబిరంలో సుమారు 200 మంది ఉద్యోగులకు రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు మరియు BMI పరీక్షలు నిర్వహించబడ్డాయి. అదేవిధంగా జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు మరియు పోలీస్ స్టేషన్లలో కూడా ప్రత్యేక ఎన్‌సీడీ స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించబడ్డాయి. అదనంగా, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ (AR) బెటాలియన్ సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక ఆరోగ్య పరీక్షా శిబిరంలో సుమారు 250 మంది సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడ్డాయి.


ఈ శిబిరాలలో ప్రధానంగా క్రింది పరీక్షలు మరియు సేవలు అందించబడుతున్నాయి:

• రక్తపోటు పరీక్షలు (Blood Pressure Screening)

• రక్తంలో చక్కెర స్థాయి పరీక్షలు (Blood Sugar Screening)

• బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అంచనా

• జీవనశైలి మార్పులపై కౌన్సెలింగ్

• రక్తపోటు నివారణ మరియు నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు

జిల్లా వైద్య ఆరోగ్యశేఖధికారి

 విశాఖపట్నం

               K.V.SHARMA EDITOR 

Comments