జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 23.05.2026
ఈరోజు అనగా తేదీ 23.05.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు భవాని గార్డెన్స్ పట్టణ ఆరోగ్య కేంద్రములను సందర్శించి అక్కడ జరుగుతున్న హెచ్.పి.వి.వాక్సిన్ కార్యక్రమమును పరిశీలించి తగు సూచనలు చేశారు. తదుపరి ఇ.హెచ్.ఆర్., అభ ఐడి రిజిస్ట్రేషన్, ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా హాస్పిటల్ సేవలు అందుతున్నవి లేనివి తెలుసుకొనుట (పబ్లిక్ పెర్సప్షన్), కె.పి.ఐ. ఇండికేటర్స్, ఎఫ్.ఆర్.ఎస్. హాజరు మొదలగు విషయాల గురించి సమీక్ష నిర్వహించారు. వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది అందరూ ఆరోగ్య కేంద్రములో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఈ సందర్శనలో పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment