Skip to main content

జీవీఎంసీ వేసవి క్రీడా శిక్షణా శిబిరాలకు విద్యార్థినీ విద్యార్థులు ఆన్లైన్‌లో, టోల్ ఫ్రీ నెంబర్  ద్వారా నమోదు చేసుకోవాలి. * మే 25 నుండి ప్రారంభం కానున్న జీవీఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులు. * జీవీఎంసీ వెబ్‌సైట్  https://www.gvmc.gov.in ద్వారా, టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 0009 ద్వారా విద్యార్థులు నమోదు చేసుకోవాలని సూచన. -జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్


 విశాఖపట్నం, మే 22: మహా విశాపట్నం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలలో పాల్గొనదలచిన విద్యార్థినీ, విద్యార్థులు తప్పనిసరిగా ఆన్లైన్‌లో, టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 0009 నందు తమ పేర్లను నమోదు చేసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శుక్రవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

జీవీఎంసీ పరిధిలో 486 కేంద్రాలలో 8 నుండి 16 సంవత్సరాల వయస్సు గల విద్యార్థినీ, విద్యార్థులకు మే 25, 2026 నుండి జూన్ 6, 2026 వరకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే వార్తా పత్రికల ద్వారా తెలియజేశామని ఆయన పేర్కొన్నారు.

ఈ శిబిరాలలో పాల్గొనదలచిన విద్యార్థులు జీవీఎంసీ అధికారిక వెబ్‌సైట్ https://www.gvmc.gov.in⁠� ద్వారా ఆన్లైన్‌లో, టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 0009 నందు నమోదు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా, సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ నమోదు సంబంధిత వివరాల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ 1800 4250 0009 ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు నమోదు ప్రక్రియకు సంబంధించిన సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్‌ ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

విద్యార్థులు తమకు సమీపంలోని శిక్షణా కేంద్రాలను ఎంపిక చేసుకొని నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. సమ్మర్ కోచింగ్ క్యాంపులలో 41 క్రీడా విభాగాలలో శిక్షణ ఇవ్వబడుతుందని, అనుభవజ్ఞులైన కోచ్‌ల ద్వారా ప్రత్యేక శిక్షణ అందించబడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శారీరక దారుఢ్యంతో పాటు క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని కమిషనర్ కోరారు.

పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ.

                 K.V.SHARMA EDITOR




Comments