Skip to main content

తీరంలో కోత నివారణకు గ్రోయిన్లు నిర్మాణం : జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్..... 26 ఎకరాల విస్తీర్ణంలో 21 గ్రోయిన్లు నిర్మాణం....


అల్లవరం, విశాఖ సందేసం....డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం  వద్ద ఓఎన్జిసి ప్లాంట్ రక్షణ, గ్రామ సముద్రపు కోతను అరికట్టడంలో గ్రోయిన్లు అత్యంత ప్రాధాన్యత


సంతరించుకున్నాయని, ఆ దిశగా ఓడలరేవు వద్ద 21 గ్రోయిన్లు 26 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహేష్ కుమార్  మాట్లాడుతూ సముద్రపు కోతను అరికట్టడానికి గ్రోయిన్లు అద్భుతమైన మార్గమని, వీటిని నిర్మించే ముందు సముద్రపు అలల దిశ, ఇసుక ప్రవాహంపై పూర్తిస్థాయి శాస్త్రీయ అధ్యయనం చేయడం జరిగిందన్నారు. సాంప్రదాయక నిర్మాణాలు, తీరప్రాంతాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఆ దిశగా రెవెన్యూ అటవీ శాఖలు ఓఎన్జిసి వారి సహకారంతో భూసేకరణ పనులు పూర్తి కాబడి గ్రోయిన్ల నిర్మాణానికి చర్యలు ప్రారంభించామన్నారు. సేకరించిన భూములలో రెవెన్యూ అటవీ భూములు ఉన్నాయన్నారు. గ్రోయిన్లు అనేవి ​సముద్ర తీరానికి బలంగా  నిర్మించే గట్టి నిర్మాణాలని, పెద్ద పెద్ద రాళ్ల కాంక్రీట్ బ్లాకులుగా నిర్మించడం జరుగుతుందన్నారు.​ 


సముద్రపు అలలు తీరానికి వాలుగా తాకినప్పుడు తీరంలోని సముద్ర అలల ద్వారా కొట్టుకుపోయే ఇసుకను గ్రోయిన్లు అడ్డుకుంటాయన్నారు. దీనివల్ల గ్రోయిన్ ఉన్న వైపు ఇసుక పేరుకు పోయి, కొత్త గా బీచ్ ఏర్పడుతుంది లేదా ఉన్న బీచ్ వెడల్పు పెరుగుతుందన్నారు. గ్రోయిన్లు సముద్రపు అలల తీవ్రతను వేగాన్ని తగ్గిస్తాయన్నాయన్నారు. ఫలితంగా అలలు తీరాన్ని బలంగా తాకలేవని తద్వారా తీరంలో  కోత తగ్గుతుందన్నారు. తీర ప్రాంతంలో ఇసుక కొట్టుకుపోకుండా ఆపి,పర్యాటకానికి పనికొచ్చేలా బీచ్‌ల ను స్థిరంగా ఉంచుతాయన్నారు.తీరానికి దగ్గరగా ఉన్న గ్రామాలు, రోడ్లు, మత్స్య కారుల ఇళ్లను సముద్రం ముందుకు చొచ్చుకురాకుండా కాపాడతాయన్నారు​.స్థానిక శాసన సభ్యులు అయితాబత్తుల ఆనందరావు ప్రసంగిస్తూ సముద్ర 


తీర ప్రాంతంలో నిర్మించే గ్రోయిన్‌ వల్ల అలల ప్రభావాన్ని నియంత్రించి ఇసుక తరలింపును తగ్గించడానికి ఉపయోగపడుతుందన్నారు. నిర్మాణం వల్ల తీర క్షీణత తగ్గి తీర ప్రాంతం రక్షించబడుతుందన్నారు.విశాలమైన బీచ్ ఏర్పడి పర్యాటక అభివృద్ధికి సహాయపడుతుందన్నారు. వరదలు, తుఫాన్ల ప్రభావం తగ్గుతుందన్నారు. సముద్ర అలల తీవ్రత కొంతవరకు నియంత్రించబడటం వల్ల తీరప్రాంత నష్టం కూడా తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి ఎం వి ప్రసాద రావు, ఓఎన్జిసి ఓడలరేవు ప్రతినిధులు పాల్గొన్నారు.

              Srinivas Spl Correspondant 

Comments