ఈరోజు అనగా తేదీ 26.05.2026 న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా పి జగదీశ్వర రావు వారి ఆదేశానుసారం నూరా హెల్త్ ఆర్గనైజేషన్, రాష్ట్ర శిక్షకులు వారు విశాఖపట్నంలోని ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో (Regional Training Centre) రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం (RKSK) కౌన్సిలర్ల కోసం యౌవన ఆరోగ్యంపై ప్రాంతీయ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ శిక్షణలో 5 జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు (ASR), పార్వతీపురం జిల్లాలకు చెందిన మొత్తం 17 మంది RKSK కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమం కేర్ కంపానియన్ ప్రోగ్రామ్ (Care Companion Program) ఆధ్వర్యంలో యౌవన ఆరోగ్య అంశాలపై నిర్వహించబడింది. దీని ప్రధాన ఉద్దేశ్యం యాడోలెసెంట్ ఫ్రెండ్లీ హెల్త్ క్లినిక్స్ (Adolescent Friendly Health Clinics) మరియు కమ్యూనిటీ అవుట్‌రీచ్ కార్యక్రమాల్లో మెరుగైన కౌన్సెలింగ్ సేవలను అందించేందుకు RKSK కౌన్సిలర్ల సామర్థ్యాన్ని బలోపేతం చేయడం.
శిక్షణ పొందిన కౌన్సిలర్లు ఇకపై యౌవన ఆరోగ్య క్లినిక్స్, పాఠశాలలు మరియు ఇతర అవుట్‌రీచ్ కార్యక్రమాల ద్వారా కమ్యూనిటీ ఆధారిత కేర్ కంపానియన్ కుటుంబ సంరక్షణ అవగాహన కార్యక్రమాల కింద యౌవన ఆరోగ్య సమస్యల ప్రాముఖ్యతపై యువత మరియు సమాజానికి అవగాహన కల్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో డా. మీనాక్షి, ప్రాంతీయ శిక్షణ కేంద్రం (మగ) ప్రిన్సిపాల్ వారు, డా.bi. హారిక, జిల్లా అర్ బి ఎస్ కె సమన్వయ కర్త వారు, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

Comments
Post a Comment