Skip to main content

: 27 వ వార్డులో ఘనంగా మహానాడు రెండవరోజు వేడుకలు [28/05, 20:58] Jaganmohan Vs: *ఐ ఎస్ బి కోలనీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ శ్రీభరత్

 


జీవీఎంసీ  27వ వార్డు పరిధి ఐ ఎస్ బి కోలనీలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ , వార్డ్ మాజీ కార్పొరేటర్ గొలగాని వీరరావు బుజ్జి ఆధ్వర్యంలో  తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు 103వ జయంతి వేడుకలు నిర్వహించారు.


ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు ఎం  శ్రీభరత్ చేతుల  మీదుగా పార్టీ పతాకం ఆవిష్కరించారు. ఎంపీ శ్రీభరత్ తో పాటు విశాఖ టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరామ్, విశాఖ దక్షిణ నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో  నందమూరి తారక రామారావు స్థాపించిన రాజకీయ చైతన్యంగల పార్టీ  తెలుగుదేశం పార్టీ అని


, తెలుగుదేశం పార్టీ బీసీ కులాలకు పక్షపాతి అని,  ఆస్తిలో మగబిడ్డలకు మాత్రమే వుండే ఆస్తిహక్కును పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మగవారితో పాటు సమాన ఆస్తి హక్కు కల్పించారని,రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం, బడికి వెళ్ళే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, పేదవారికి జనతా వస్త్రాలు పంపిణీ తదితర ఎన్నో సంక్షేమపధకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ దేనన్నారు. పార్టీ స్థాపించిన ఆనతి కాలంలో అధికారంలోకి వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కే సాధ్యమయ్యిందన్నారు.పార్టీ పెట్టిన అతితక్కువ సమయంలో ఢిల్లీ లోకసభలో ప్రతిపక్ష పాత్రలో అతి పెద్ద పార్టీగా అవతరించి కేంద్ర కాంగ్రెస్ పార్టీని గడగడలాడించి మట్టికరిపించి నేషనల్ ఫ్రంట్ కూటమిని ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపిన చరిత్ర ఎన్టీఆర్ కే సాధ్యమయ్యిందన్నారు.మహనీయుడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. చోడే వెంకట పట్టాభిరామ్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ చిరస్మరణీయుడని తెలుగుప్రజలకు చిరకాలం గుర్తుండిపోయే మహానుభావుడన్నారు.


సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ పేదప్రజల కష్టాలు అన్ని అవగతం చేసుకుని నాడు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని, ఏనాడు ఎవరికి తలవంచని కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం సాగించేదని, ఎన్టీఆర్ దెబ్బకి ఢిల్లీ గద్దెను ఒంటరిగా మళ్ళీ అధికారంలోకి వచ్చే అర్హత నేటికీ లేదన్నారు.ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.అనంతరం  కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వార్డ్ టిడిపి సీనియర్ నాయకుడు 


ఈగలపాటి సత్తిరాజు ఇంటికి  ఎంపీ శ్రీభరత్, చోడే వెంకట పట్టాభిరామ్, సీతంరాజు సుధాకర్  వెళ్లి పరామర్శించి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో 27వ వార్డ్ టీడీపీ అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మీ శివప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు పివి రమణరావు, పోలుమూరి గురునాథ రావు, దక్షిణ నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షుడు ఈతలపాక శ్యాం ప్రసాద్, రాపర్తి తాతబాబు, బోర రాంబాబు రెడ్డి, కోరాడ రమణ, పాలికల సింహాచలం, మచ్చా కనకారావు, మజ్జి వెంకట సత్యనారాయణ, బెహరా ఆశిష్, నాగేంద్ర రెడ్డి, గంగరాజు, పీతల పోలారావు, బొట్టా శంకర్, పాలికల రవి, జగన్, సింహాద్రి, యేసు, నాగభూషణం, గొరుసు గురునాథ రెడ్డి, రామచంద్ర రెడ్డి, భరణికాన ప్రసాద్, కంచిపాటి శ్రీను, నవీన్, ప్రసాద్, అనుప్రదీప్, కనకరాజు, గారి చిన్న,  సిడగం చిన్నారావు, బొట్టా అప్పారావు, సుజాత, సుగుణ, అచ్చియమ్మ, సత్యవతి, కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Comments