మండుటెండలు, వేడి గాలుల మధ్య 28వ రోజు దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఉచిత మజ్జిగ, త్రాగునీటి పంపిణీ – నాలుగు సంస్థలు, 57 మంది వాలంటీర్లు 600 మంది ప్రయాణికులు మరియు 300 మంది ఒడిశా బాల వికాస్ విద్యార్థులకు సేవలు ◆
మానవ సేవే మాధవ సేవ” అనే మహోన్నత స్ఫూర్తితో మండుటెండలు, వేడి గాలులను సైతం లెక్కచేయకుండా గత 28 రోజులుగా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో కేవలం 2 నిమిషాల హాల్ట్ సమయంలో ప్రయాణికులకు ఉచిత త్రాగునీరు మరియు మజ్జిగ పంపిణీ సేవలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.
సాధారణ రైల్వే బోగీల్లో ప్రయాణించే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్, శ్రీ సత్యసాయి సమితి, స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్, మానవత సభ్యులు మరియు దాతల సహకారంతో ఆదివారం తేదీ: 24-05-2026 న అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల తీవ్రత మధ్య నిస్వార్థ సేవలను అందించారు. సాధారణ బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఉచితంగా 600 ఒక లీటర్ రైల్ నీర్ త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేయడం ఒక గొప్ప మానవతా సేవగా నిలిచింది.
ఈ రోజు ఆదివారం (24-05-2026) మధ్యాహ్నం 12:45 గంటల నుండి 2:00 గంటల వరకు “మానవ సేవే మాధవ సేవ” అనే భావనతో 57 మంది వాలంటీర్లు దువ్వాడ రైల్వే స్టేషన్‌లో సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు.
భువనేశ్వర్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు (రైలు నెం. 18463) మరియు షాలిమార్ నుండి వాస్కో డ గామాకు వెళ్తున్న అమరావతి ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 18047) రైళ్లకు దువ్వాడ రైల్వే స్టేషన్‌లో కేవలం 2 నిమిషాల హాల్ట్ సమయంలో మహిళలు, వృద్ధులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు మరియు చిన్నారులతో సహా సాధారణ బోగీల్లో ప్రయాణిస్తున్న సుమారు 600 మంది ప్రయాణికులకు ఒక్కో లీటర్ రైల్ నీర్ త్రాగునీటి బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు.
తక్కువ హాల్ట్ సమయం కారణంగా చాలా మంది సాధారణ బోగీ ప్రయాణికులు నీరు తీసుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి రైలు నుండి ప్లాట్‌ఫారమ్‌పై దిగలేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మహిళలు, వృద్ధులు, చిన్నారులు మరియు దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా ప్లాట్‌ఫారమ్-1 పై బోగీల తలుపులు, కిటికీల ద్వారా నేరుగా నీటి బాటిళ్లు అందజేశారు.
27-04-2026 నుండి గత 28 రోజులుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్, శ్రీ సత్యసాయి సమితి ఉక్కునగరం, మానవత, స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్, లయన్స్ క్లబ్, స్పందన చేయూత ఫౌండేషన్, వాయిస్ ఆఫ్ గాజువాక, అగనంపూడి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సంస్థలు మరియు దువ్వాడ పోలీసులు కలిసి ఇప్పటివరకు మొత్తం 6,492 త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు.
ఈ రోజు (24-05-2026) నిర్వహించిన కార్యక్రమంలో, సన్యాసిరాజు, కె.వి.డి. ప్రసాద్
విష్ణుమూర్తి, VRK రాజు, ఈశ్వర్, శకుంతల, శ్రావణి, యజ్ఞ, ఎం. అప్పల నాయుడు కె. రాజేశ్వర రావు,
రాములు, రమేష్, ఆనంద్, హర్ష, గురిచరణ్, కామేశ్వరరావు, భూషణ్, సూర్య, రమేష్, వేణు, సాయి, మస్తానయ్య, జి.వి. ప్రసాద్, కృష్ణమోహన్, రంగరాజు, వరలరాజు, సుబ్బారాజు, నాగరాజు, గంగాధర్, రమణ, కె.ఎస్.ఎన్. రాజు, శివరామకృష్ణ, వర్మ, పి.ఎన్.వి.ఎస్.ఎస్. రాజు, వీరాజు, సుబ్బారాజు, రవి, వరాహాలబాబు, చంద్రశేఖర్, కె. శివవర్మ, రవి, గోవిందరాజు, విజయ్‌కుమార్, కుమార్, మానవేంద్రనాథ్, సైదులు
తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజు సేవా కార్యక్రమానికి స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్, మానవత మరియు ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి ఆర్థిక సహాయం అందించాయి. వారి సహకారానికి దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
రైలు దువ్వాడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సమయంలో సాధారణ బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు దాహంతో కిటికీల బయటకు చేతులు చాపుతూ ఉచిత త్రాగునీటి బాటిళ్లు ఇవ్వాలని కోరడం హృదయాన్ని కదిలించే దృశ్యంగా మారింది. వాలంటీర్లు వేగంగా స్పందిస్తూ బోగీల కిటికీలు, తలుపుల ద్వారా ప్రయాణికులకు నేరుగా రైల్ నీర్ త్రాగునీటి బాటిళ్లు అందజేశారు.
రైలు బయలుదేరిన అనంతరం ప్రయాణికులు సేవలను అభినందించగా, వాలంటీర్లు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ప్రయాణికుల ప్రశంసలు వాలంటీర్లకు మరింత సేవా స్పూర్తిని అందించాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ మహత్తర సేవా కార్యక్రమానికి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజలు ఇదే విధంగా సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
K.V.SHARMA EDITOR







Comments
Post a Comment