జాతీయస్థాయి పవర్ లిప్టింగ్ క్రీడల్లో రికార్డుల మోత..... 3వ రోజు ఉదయం విజేతలకు బహుమతి ప్రధానోత్సవం....
అమలాపురం, విశాఖ సందేసం....అమలాపురం శ్రీ సత్యనారాయణ గార్డెన్స్ నందు అమలాపురం ఎంపి జి.ఎం.హరీష్ బాలయోగి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్, జూనియర్ మెన్ అండ్ ఉమెన్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. దేశంలోని 29 రాష్ట్రాల నుంచి సుమారు 900 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ కంకిపాటి వెంకటేశ్వరరావు వెల్లడించారు. పోటీల 3 రోజు ఉదయం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, వంటెద్దు వెంకన్నాయుడు హాజరయ్యారు. యువత & విద్యార్థులకు ఈ క్రీడలు చాలా ఉపయోగకరమని, జాతీయస్థాయి మరియు అంతర్జాతీయ స్థాయిల్లో తమ ప్రతిభను చాటడం వల్ల దేశానికి మన ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలతో పాటు జీవితంలో స్థిరపడగలరని పేర్కొన్నారు. అనంతరం మెన్ విభాగంలో 59 మరియు 66 కేజీల కేటగిరీలలో సబ్ జూనియర్ అండ్ జూనియర్ లలో విజేతలైన క్రీడాకారులు, క్రీడాకారిణులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సిపి నాయకులు చెల్లిబోయిన శ్రీనివాసరావు, జడ్పిటిసి పందిరి .శ్రీహరి, నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కే.సతీష్ కుమార్, గారపాటి చంద్రశేఖర్, దొమ్మేటి రాము, పప్పా ప్రభాత్, వెలగట్ల జగదీష్,పప్పుల శ్రీరామచంద్రమూర్తి, దొమ్మేటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Srinivas Spl Correspondant


Comments
Post a Comment