గృహ వ్యర్థాలను సంపదగా మార్చుకోవాలి. – జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ పిఎం. సత్యవేణి. *దక్షిణ జోన్ వార్డు నెం.30లో ఇంటింటా కంపోస్టింగ్‌పై అవగాహన కార్యక్రమం. *వంటింటి తడి వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారీపై ప్రత్యక్ష ప్రదర్శన.
విశాఖపట్నం, మే 20: ప్రతి కుటుంబం గృహ వ్యర్థాలను సక్రమంగా విభజించి ,తడి వ్యర్ధాలతో కంపోస్టింగ్ విధానాన్ని అలవాటు చేసుకుంటే పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశుభ్రమైన నగర నిర్మాణానికి దోహదపడుతుందని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ (జనరల్) పిఎం. సత్యవేణి పేర్కొన్నారు.
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ దక్షిణ జోన్ పరిధిలో స్వచ్ఛత, సుస్థిర వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమంలో భాగంగా వార్డు నెం.30లో గృహ వ్యర్థాలతో కంపోస్టు తయారీపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఆమె బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వంటింటి నుండి వెలువడే తడి వ్యర్థాలను ఉపయోగించి సేంద్రియ ఎరువును ఎలా తయారు చేయాలో ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు. ఇంటి వద్దే కంపోస్టింగ్ చేయడం వల్ల వ్యర్థాల పరిమాణం తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని ఆమె వివరించారు.
అలాగే తడి వ్యర్థాలను వేరుగా సేకరించడం, గృహ స్థాయిలో వ్యర్థాల వర్గీకరణ, సుస్థిర వ్యర్థాల నిర్వహణ పద్ధతులపై స్థానిక ప్రజలకు ఆమె అవగాహన కల్పించారు.
ప్రతి కుటుంబం ఇంటి వద్దే కంపోస్టింగ్‌ను అలవాటు చేసుకోవాలని, దీంతో వ్యర్ధాలు తరలింపు తగ్గడంతో పాటు పరిశుభ్రమైన పరిసరాలు నెలకొంటాయని ,ప్రజలు ఉత్సాహంగా పాల్గొని గృహ వ్యర్థాలను కంపోస్టింగ్ ద్వారా తగ్గించే దిశగా సహకరించాలని అడిషనల్ కమిషనర్ కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అప్పలకొండ, ఎఎంఓహెచ్ డాక్టర్ కృష్ణంరాజు, ఏపీడీ పద్మావతి, సిఓ, ఆర్‌పీలు, స్థానిక ప్రజలు మరియు ఇతర జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి, జివిఎంసి

Comments
Post a Comment