Skip to main content

31న మరిడిమాంబ సత్తమ్మ తల్లి పండుగ మహోత్సవం* *ఆలయం వద్ద భారీ ఏర్పాట్లు* *12 గంటలకు అనుపు మహోత్సవం ప్రారంభం* *పొలిమేర దేవతకు పసుపు కుంకుమల సమర్పించుకోండి* *అమ్మవారి అలంకరణకు 1 గ్రామ్ గోల్డ్ నగలు బహుకరించిన గంట్ల దంపతులు*


సింహాచలం మే 28 సింహాద్రినాథుడు సోదరి.. అడవివరం శ్రీనివాస్ నగర్ తో పాటు 14 గ్రామాల ప్రజల పొలిమేర దేవతగా విరాజిల్లుతున్న శ్రీ సత్తెమ్మ తల్లి.. మరిడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాన్ని ఈ నెల 31న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ

అపురూప మహోత్సవాన్ని ఈ ఏడాది కూడా అంగరంగ  వైభవంగా నిర్వహించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాటు చేస్తున్నాయి.. ఆదివారం తెల్లవారుజామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆరాధన గావిస్తారు.. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.. ఆలయం వద్ద.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా  అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షులు పి వెంకట్రావు లు గురువారం తెలిపారు . అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించడం తో పాటు ఆరోజు అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరణ గావిస్తామన్నారు.. భక్తులకు ప్రసాద వితరణ. మజ్జిగ మంచినీరు ఇతర చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా మన్నారు. ఇందుకోసం.... భక్తుల.. దాతల సహకారం తీసుకుంటామన్నారు..

అమ్మవారి అలంకరణకు అవసరమైన వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు గురువారం ఆలయ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కుటుంబ సభ్యులు ఆలయ అధ్యక్షుడు వెంకటరావు కు అందజేశారు..

*31 న. 12 గంటలకు అనుపు మహోత్సవం ప్రారంభం*

మరిడిమాంబ ..సత్తెమ్మ తల్లి పండుగ రోజున మధ్యాహ్నం 12 గంటలకు ఏతపేటలో ఉన్న శతకం పట్టు నుంచి అనుపు మహోత్సవం ప్రారంభం కాను0దన్నారు.. పూజారి వంశీయులు లండ వెంకటరమణ ఆధ్వర్యంలో ముందుగా పూజారులు అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి గ్రామస్తులతో కలిసి అమ్మవారి అనుపు మహోత్సవం ప్రారంభమవుతుందన్నారు.. ఇందుకోసం సింహాచలం దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో

.. తగిన ఏర్పాట్లు చేసేందుకు అధికారులకు సిబ్బందికి ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ చేశారన్నారు.. అలాగే గ్రామ కమిటీ కూడా ఇందుకోసం ఏర్పాట్లు చేస్తుందన్నారు.. కావున 14 గ్రామాల ప్రజలంతా మరిడిమాంబ సత్తెమ్మ తల్లి పండుగలో పాల్గొని అమ్మవారికి పసుపు.. కుంకుమలు సమర్పించుకుని..కరుణ కటాక్షాలు పొందాలని గంట్ల శ్రీనుబాబు.. వెంకట్రావు లు కోరారు

Comments