విశాఖ: విశాఖ సందేశం:29 మే:మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలో తెలుగు దేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఎస్ కోట ఎమ్మెల్యే లలిత కుమారి తెలిపారు.మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు గాను హర్షం వ్యక్తం చేస్తూ విశాఖ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎస్ కోట ఎమ్మెల్యే లలిత కుమారి,పలువురు తెలుగు మహిళలు సంబరాలు
నిర్వహించారు.తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ప్లేకార్థులతో నినాదాలు చేసారు. కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకొన్నారు. ఈ సందర్భంగా లలిత కుమారి మాట్లాడుతూ మహిళల తరఫున నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్,స్ఫూర్తిగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లకు రాష్ట్రంలోని మహిళలు ఎంతో రుణపడి ఉంటారన్నారు.గొడ్డలి పార్టీలో మహిళ లకు రక్షణ లేదని,తల్లికి , చెల్లి కి న్యాయం చేయలేనివారు మిగతా మహిళల కు ఏమి చేస్తారో అని వ్యంగంగా వాఖ్యానించారు.జగన్ ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందన్నారు.
తెలుగు దేశం పార్టీ మహిళకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. మహిళా సాధికారత అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీఅని, చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకున్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహిళా రిజర్వేషన్లు మహిళ సాధికారత పేపర్లకే పరిమితం కాకుండా చేతల్లో చూపించారని ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. మొట్టమొదటిసారిగా శాసనసభ స్పీకర్ ఒక మహిళకు అవకాశం కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ అన్నారు.స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా ఇప్పటివరకు 60 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయన్నారు. తల్లికి వందనం ద్వారా 43 లక్షల మంది తల్లుల ఖాతాలో 8745 కోట్ల రూపాయలు జమయ్యాయన్నారు.ఈ కార్యక్రమంలో విఎంఆర్డిఏ మాజీ చైర్మన్ అక్రమాని విజయనిర్మల, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు ఈతలపాక సుజాత, సర్వసిద్ధి అనంతలక్ష్మి, గాయత్రి ఫణి కుమారి,మహిళా నాయకులు కేదారి లక్ష్మి, తోట శ్రీదేవి, పిడుగు మంగ లక్ష్మి,గనగళ్ల సత్య, నక్క అన్నపూర్ణ, బర్ల పద్మ,బొడ్డేపల్లి లలిత, పి జ్యోతి, హల్తే హేమలత,ఉసిరికాయల డిల్లీశ్వరి,అను సుమిత్ర, సౌజన్య,జై శ్రీ,శ్రీదేవి, ధవళ విజయ్ కుమారి, రాంబాయి రాధా తదితరులు పాల్గొన్నారు.
K.V.SHARMA EDITOR



Comments
Post a Comment