విశాఖ దక్షిణనియోజకవర్గం 36 వ వార్డులో మహానాడు 2026 వేడుకలు బుధవారం క్లస్టర్ ఇంచార్జి కేదారి లక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
విశాఖ:విశాఖ సందేశం :.ఏవీఎన్ కాలేజీ డౌన్ సాయి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు విశాఖ పార్లమెంటరీ టిడిపి అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరామ్, విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్,పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ హాజరై ముందుగా పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ వార్డులో ఇంతమంది పార్టీ నాయకులు, కార్యకర్తలను సమీకరించి,ఎవరికి ఏ ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లను చేసిన వార్డ్ క్లస్టర్ ఇంచార్జి కేదారి లక్ష్మిని అభినందించారు.ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గోడి నరసింహ చారి,వార్డు ప్రెసిడెంట్ ఒదురు శివయ్య,మజ్జి త్రినాధరావు,కే గణపతి రావు,వీ శ్రీనివాస రావు,భద్ర రావు,రెడ్డి,రమణ, టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ కే రమణమ్మ,కే వెంకట రమణ,బెహెర వెంకట రత్నం,బీ సత్యనారాయణ,రాయి రాము తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


Comments
Post a Comment