Skip to main content

అత్యంత అరుదైన రేయ్‌స్ సిండ్రోమ్‌తో కోమాలోకి వెళ్లిన 4 ఏళ్ల చిన్నారికి మెడికవర్‌లో పునర్జన్మ....విశాఖలో తొలిసారిగా PICUలో అత్యాధునిక CRRTతో ప్రాణాలు కాపాడిన మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు......*


విశాఖపట్నం :విశాఖ సందేశం:మే 2026:
అధిక జ్వరం తర్వాత ఒక్కసారిగా స్పృహ కోల్పోయి, అసంబద్ధంగా మాట్లాడటం, తీవ్ర అయోమయం, మెదడు పనితీరు క్షీణించడం వంటి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఆసుపత్రికి చేరిన 4 ఏళ్ల చిన్నారికి మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్స్, విశాఖపట్నం వైద్యులు అరుదైన రేయ్‌స్ సిండ్రోమ్‌ను గుర్తించి ప్రాణాలు కాపాడారు. చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా ఉండగా, పరీక్షల్లో ఆక్యుట్ లివర్ ఫెయిల్యూర్‌తో పాటు రక్తంలో అమోనియా స్థాయిలు ప్రమాదకరంగా పెరిగినట్లు తేలింది. ఈ హైపర్ అమోనీమియా కారణంగా చిన్నారి గ్రేడ్-3 హెపాటిక్ ఎన్‌సెఫలోపతి దశకు చేరుకుని ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది.

పరిస్థితి అత్యవసరంగా మారడంతో చిన్నారిని వెంటనే PICUలో చేర్చి, కన్సల్టెంట్ పీడియాట్రిషన్ & నియోనాటాలజిస్ట్ డా. ఎం. సాయి సునీల్ కిషోర్, డా. విజయ్ కృష్ణ మరియు ప్రత్యేక నిపుణుల బృందం ఆధ్వర్యంలో చికిత్స ప్రారంభించారు. సాధారణ చికిత్సకు అమోనియా స్థాయిలు తగ్గకపోవడంతో, అత్యంత క్లిష్టమైన Continuous Renal Replacement Therapy (CRRT – CVVHDF)ను అమలు చేశారు. ఈ అత్యాధునిక ప్రాణరక్షక చికిత్స ద్వారా రక్తంలోని ప్రమాదకర టాక్సిన్స్ తొలగించి, చిన్నారి మెదడు మరియు శరీర వ్యవస్థలను స్థిరపరిచారు.

పలు రోజుల పాటు వెంటిలేటరీ, న్యూరోలాజికల్, లివర్ మరియు హీమోడైనమిక్ పర్యవేక్షణలో చికిత్స అందించగా, చిన్నారి క్రమంగా స్పృహను తిరిగి పొందింది. అనంతరం పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ కావడం వైద్యరంగంలో విశేష విజయంగా నిలిచింది.

డా. ఎం. సాయి సునీల్ కిషోర్ మాట్లాడుతూ: “రేయ్‌స్ సిండ్రోమ్ చాలా అరుదైనదైనా, వేగంగా ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్తుంది. సరైన సమయంలో నిర్ధారణ చేసి, CRRT వంటి అధునాతన చికిత్స అందించడమే చిన్నారి ప్రాణాలను రక్షించింది. మా PICU బృందం సమన్వయం, నర్సింగ్ సిబ్బంది అంకితభావం ఈ విజయానికి ప్రధాన కారణం” అని తెలిపారు.

మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్న ఆధునిక పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ సదుపాయాలు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా చిన్నారులకు నూతన జీవం అందించగలవని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

                  K.V.SHARMA EDITOR 

Comments