Skip to main content

వాకార్స్ అందరూ సంయుక్తంగా సేవాలాందించాలి : వాకర్స్ క్లబ్ మాజీ ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు ప్రభావతి అమలాపురం శ్రీకళా గ్రాండ్ లో వాకర్స్ క్లబ్ 40 వసంతాల వేడుకలు....


అమలాపురం, విశాఖ సందేసం
....డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం శ్రీ కళా గ్రాండ్ లో సాయి సంజీవిని మహిళా వాకర్ఫ్ క్లబ్ మరియు డిప్యూటీ గవర్నర్ జల్లి సుజాత సౌజన్యంతో డిస్ట్రిక్ట్ 103 గవర్నర్ తోలెటి సూర్యనారాయణ అధ్యక్షతన డిస్ట్రిక్  103 రెండవ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మూడు జిల్లాల వాకర్స్ క్లబ్ నాయకులు ముఖ్యతిదులుగా వాకర్స్ క్లబ్ మాజీ ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు ప్రభావతి ముఖ్యఅతిథిగా పాల్గొని భారీ కేక్ కట్ చేసి వాకర్స్ క్లబ్ 2026 నాటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాకర్స్ క్లబ్ గవర్నర్ సభ్యులు మధ్య ఘనంగా వేడుకలను  నిర్వహించుకున్నారు


. ఈ సందర్భంగా  ప్రభావతి మాట్లాడుతూ వాకర్స్ క్లబ్బుల లో నేడు అయిదు లక్షల మంది 1650 క్లబ్బులలో సభ్యులు ఉన్నారని,  రోజురోజుకు వాకర్స్ క్లబ్ సేవలు అందిస్తూ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిందన్నారు. గవర్నర్ తోలేటి సూర్యనారాయణ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్ని సంపదలు ఉన్న శూన్యమని ఆరోగ్యమే మహాభాగ్యమని నడు- నడిపించు అనే నినాదంతో 1986లో వాకర్స్ క్లబ్ స్వర్గీయ సుంకర ఆళ్వార్దాస్ విశాఖపట్నంలో స్థాపించారు నేటికీ 2026 నాటికి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమలాపురంలో మహిళా వాకర్స్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఆరోగ్యమే మహాభాగ్యమని ఎన్ని సంపదలు ఉన్న ఆరోగ్య మిన్న అనే నినాదాలు చేస్తూ శ్రీ క‌శా గ్రాండ్స్ కి చేరుకుని 40 వసంతాల వేడుకలు నిర్వహించుకున్నామని తెలిపారు. అదే విధంగా ఉదయం వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో అమలాపురం డి.ఎస్. పి ప్రసాద్ కేక్ కట్ చేసి సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పీ ప్రసాద్  మాట్లాడుతూ ప్రభుత్వం పిలువు మేరకు ఇంధనాన్ని పొదుపు చేయుటకు ఆరోగ్యాన్ని కాపాడుకొనుటకు ప్రతి ఒక్కరూ తగిన శారీరక శ్రమ చేయాలని అందుకు ఏర్పడినది 


 వాకర్స్ క్లబ్ అని ఈ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలను ప్రభావితం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ కౌన్సిలర్ ఎం భాస్కర్ రావు, ఎలక్ట్ గవర్నర్ ఎంఎస్ మూర్తి, డిప్యూటీ గవర్నర్ జల్లీ సుజాత, టీవీవీఎస్ తిలక్ బాబు, కోడి బాబ్జి , బోనం సత్యవర ప్రసాద్, చీప్ కోఆర్డినేటర్ నాగేంద్ర, క్యాబినెట్ సెక్రటరీ మల్లేశ్వరరావు, కోశాధికారి వెచ్చ నాగసత్య, మాజీ గవర్నర్ సప్ప నాగేశ్వరరావు, తేతలి సత్యనారాయణ రెడ్డి, వై ఎస్ ఎన్ మూర్తి, గుర్రాల అమల, భవాని, మనీషా, పుష్ప సాయి, సంజీవని మహిళా వాకర్స్ తదితరులు పాల్గొన్నారు

               B Srinivas Spl Correspondant 

Comments