Skip to main content

రాష్ట్రంలో జర్నలిస్టుల సొంత ఇంటి కల నెరవేర్చండి* *తెలంగాణలో ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు* *ప్రమాద బీమాను పునరుద్ధరించండి* *ముగిసిన ఫెడరేషన్ సభ్యత్వ నమోదు గడువు.. 800 మందితో జాబితా* *జర్నలిస్ట్ రవికుమార్ మృతి పట్ల* *ఫెడరేషన్ ఘన నివాళులు* *కార్యవర్గ సమావేశంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు*


 అక్కయ్యపాలెం మే 19 రాష్ట్రంలో జర్నలిస్టుల సొంత ఇంటి కల నెరవేర్చాలని.. కూటమి ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి.. ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు.. విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ లు కోరారు.. మంగళవారం ఇక్కడ అక్కయ్యపాలెం జంక్షన్ లో ఉన్న ఒక ప్రైవేట్ హోటల్ లో 


ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో పాల్గొన్న వీరు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అక్కడ జర్నలిస్టులకు 


నూతనంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు.. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే రీతిన వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు.. గతంలో రెండు ప్రభుత్వాలు జర్నలిస్టుల నుంచి ఆన్ లైన్.. ఆఫ్ లైన్ పద్ధతుల్లో దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు.. అయినప్పటికీ వర్కింగ్ జర్నలిస్టుల కు ఇళ్ల స్థలాలు కేటాయింపు జరగలేదన్నారు.. తాజాగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తో పాటు కూటమి ముఖ్య నేతలకు తమ వినతులను అందజేసి పరిస్థితులను తెలియజేశామన్నారు.. అలాగే వర్కింగ్ జర్నలిస్టులకు అత్యంత కీలకమైన ప్రమాద బీమా పాలసీని వెంటనే పునరుద్ధరించాలన్నారు 


హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం వెంటనే చెల్లించాలని ఈ విషయంలో నిర్లక్ష్యం వహించ వద్దన్నారు.. విశాఖ జిల్లాలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న జర్నలిస్టులు తగిన వివరాలతో డిపిఆర్ఓ కార్యాలయంలో సంప్రదించవచ్చునన్నారు.. 2026 సంవత్సరానికి సంబంధించి విశాఖ జిల్లా వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిందన్నారు.. సుమారు 800 మంది జర్నలిస్టులు తమ యూనియన్ లో సభ్యత్వ నమోదు చేయించుకున్నట్లు వీరు చెప్పారు.. ఈ జాబితాను రాష్ట్ర కార్యవర్గానికి పంపించాలని సమావేశంలో తీర్మానించడం జరిగింది అన్నారు..

ఈ కార్యవర్గ  సమావేశంలో విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసరావు.. ఆర్గనైజింగ్ సెక్రటరీ ధవలేశ్వరపు రవికుమార్... ఉపాధ్యక్షులు పి నగేష్ బాబు.. బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు.. కార్యదర్శి కింతాడ మదన్..స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్.. కార్యదర్శి కే శ్రీనివాసరావు.. సంఘ ప్రతినిధులు బొబ్బర ప్రసాద్.. హరి...కోశాధికారి కేవీ శర్మ.. గణేష్త దితరులు పాల్గొన్నారు 

రవికుమార్ మృతికి ఘన నివాళులు* 

ఎన్ఏడి ప్రాంతానికి చెందిన జర్నలిస్టు పి..రవికుమార్ మృతి పట్ల వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్కా ర్యవర్గ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా రవికుమార్ మృతి పట్ల వీరంతా మౌనం పాటించి ఘన నివాళులర్పించారు.. రవికుమార్ ఆత్మకు పవిత్ర శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు

Comments