అల్లూరి'
అజేయుడు.
ఆరు అడుగుల
అందగాడు,
అందరికీ
అందే వాడు,
అందరి మన్ననలు
చూరగొనె వాడు,
సుందర వదనుడు,
సద్గుణ సంపన్నుడు,
సదాచార వ్రతుడు,
బహు నిష్ట
గరిష్టుడు,
అందరి ఇష్టుడు
నేడు తాను
95 వసంతాలు
సునాయాసంగా
దాటుకుని నేడు
96వ వత్సరం
లోకి అడుగిడు
తున్న శుభ
తరుణం లో
అందరం
అందిద్దాం
మన మన
నిండు మనస్సు
లతో హృదయ
పూర్వక
శుభాకాంక్షలు.
అటులనే
వేడుకుందాం
మనసారా
ఆ 'అన్నవరం'
శ్రీ సత్యన్నారాయను
ణ్ణి ఈ మన
అల్లూరి సత్యన్నారాయణ
ప్రసాదుని
తన దీవెనలు
అందచేయమని,
మరిన్ని జన్మదిన
వేడుకలు
ఇదే వేదిక మీద,
ఇదే అభిమానుల
నడుమ జరుపు
కునేటట్లు
ఆశీర్వదించమని.
ఆయన ఆరోగ్య
రహస్యం
హృదయం
విశాలం,
నిష్కల్మషం.
అందరూ
కావాలి,
అందరూ
రావాలి.
అటు Past
ఇంటర్నేషనల్
అధ్యక్షులు,
Past జిల్లా
గవర్నర్లని
సమానముగా
ఆదరించే
మనస్తత్వం.
లోవరాజు,
లక్ష్మి ల నుంచి
అందరి క్షేమం,
సంక్షేమం కోరే
తత్వం వారిది.
అల్లూరి వారిది
అందరి తో
అల్లుకు పోయే
వ్యక్తిత్వం.
దయా గుణం,
దాన గుణం,
వివేకం, వినయం,
సహనం,
సౌశీల్యం,
సహృదయ
వారిది.
అందరికీ
స్ఫూర్తి ప్రదాత.
ఇలాంటి
వ్యక్తులు
నేటి సమాజం లో
చాలా అరుదుగా
తారస పడతారు.
వారు శతకానికి
కేవలం 5 అడుగుల
చేరువలో ఉన్నారు.
వారి అర్ధాంగి
శ్రీమతి
హేమలత గారు
ఇరువురూ
లక్ష్మీ నారాయణులు
లాంటి వారు
అలాగే వారిని
అనునిత్యం
దగ్గరుండి
చూసుకునే
మరో వ్యక్తి
'ప్రభాకర్'.
వారికి కొడుకులు
లేరన్న వెలితి
ఏనాడు లేదు
వారి ప్రతీ జన్మదిన
వేడుకకు వారి
ముచ్చటయినా
ముగ్గురు కుమార్తెలు
విచ్చేసి శుభాకాంక్షలు
చెప్పడం
పరిపాటి.
ఇంకో విశేషం
ఏమిటంటే వారి
ప్రతీ జన్మదిన
వేడుకకు మనం
వెళ్లి శుభాకాంక్షలు
తెలియ చెస్తే వారు
వచ్చిన వారందరికీ
చక్కటి అల్పాహారం
తో పాటు మంచి రిటర్న్ gift కూడా
ఇవ్వడం వారి
సహృదయతకి
నిదర్శనం.
వారు మన
వాకర్స్ ఇంటర్నేషనల్ కి
ప్రప్రధమ సెక్రటరీ
జనరల్ కావడం
విశేషం. మన
ప్రస్తుత Mg.
Trustee శ్రీ Wr. కొత్త
రామానందం గారి
సూచన మేరకు
సెక్రటరీ జనరల్,
Addl. Secy. Genl.
మరియు లోవరాజు,
లక్ష్మి నలుగురూ వెళ్లి శ్రీమతి శ్రీ
ASN ప్రసాద్ గారికి
95 జన్మదిన శుభాకాంక్షలు
తెలియచేయమని,
మన వాకర్స్ ఇంటర్నేషనల్
ఫౌండేషన్ ట్రస్ట్
తరపున
శ్రీ సత్యనాధం గారు
వారు అనారోగ్య
కారణం గా రాలేనని, నన్ను
శ్రీ లోవరాజుని,
శ్రీమతి లక్ష్మి కి
ఆదేశించిన మీదట
మేము వెళ్లి వారికి
శుభాకాంక్షలు
తెలియచేయడం
జరిగింది.
ఇంకొక విషయం
ఏమిటంటే 1986 నుంచి నేటి 2026
వరకూ మన వాకర్స్
ఇంటర్నేషనల్ కి
నిరంతర సేవలు
అందిస్తున్న వారిలో
ప్రప్రధములు శ్రీ
ASN ప్రసాద్ గారైతే,
ద్వితీయులు మన
WR. DR. కొత్త
రామానందం గారు
మరియు WR. AHN
వెంకటరావు గార్లు అని మనం అంటే
ప్రతీ వాకర్ గర్వం గా చెప్పు కో వచ్చు.
స్వర్గీయ ఆల్వారునిది ప్రప్రధమ అడుగు
అయితే, ద్వితీయ
అడుగు శ్రీ అల్లూరి
వారిదే ఇలా గడచిన
40 వత్సరాలు గా
అడుగు, అడుగు
అందరి అడుగులు
తోడై ఆవిర్భవించి
నదే నేటి మన
వాకర్స్ ఇంటర్నేషనల్
దిన దిన ప్రవర్ద
మానమై వెలుగొందు
తోంది, వారి
నేతృత్వం /
సారథ్యంలో....
Past Presidents అందరూ అతిరధ
మహారధులే,
ఎవ్వరూ తీసిపోరు,
వారి వారి ప్రతిభా
పాఠవాలు చిరస్మరనీయం.
అందరికీ ధన్యవాదములతో
సదా వాకర్స్ ఇంటర్నేషనల్
సేవలో
wr డాక్టర్ నందురామకృష్ణ
Sr SUB ఎడిటర్


Comments
Post a Comment