శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. * సింహాచలం దేవస్థానంలో స్వచ్ఛంద సేవా సంస్థలతో అవగాహన సదస్సు.(Awareness & Training Program) * భక్తుల డిజిటల్ సేవలపై ప్రత్యేక శిక్షణ.
సింహాచలం 27 మే 2026 :సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులకు మరింత మెరుగైన, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా బుధవారం వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో ఒక ప్రత్యేక అవగాహన మరియు శిక్షణా కార్యక్రమం (Awareness & Training Program) నిర్వహించారు.
ఈ సదస్సులో దేవస్థానం ఐటీ విభాగం ఆధ్వర్యంలో, భక్తులు డిజిటల్ పద్ధతుల్లో పూజా మరియు దర్శన టికెట్లను ఎలా పొందాలో సేవా సంస్థల సభ్యులకు అత్యంత వివరాత్మకంగా అవగాహన కల్పించారు.
దేవస్థాన ఈవో శ్రీ జె. వెంకట్రావు ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, కొండపైకి వచ్చే భక్తులకు క్యూ లైన్లలో ఇబ్బంది లేకుండా డిజిటల్ విధానాల ద్వారా టికెట్లు పొందే ప్రక్రియను సులభతరం చేశామని తెలిపారు.
మనమిత్ర యాప్/పోర్టల్,ఆన్‌లైన్ బుకింగ్
సింహాచలం దేవస్థానం క్యూఆర్ కోడ్ స్కానింగ్ కియాస్క్ మిషన్ల వినియోగం ద్వారా సేవ మరియు దర్శన టికెట్లు పొందే విధానాన్ని ఐటీ విభాగం క్షుణ్ణంగా వివరించింది.
ఈ శిక్షణ పొందిన సేవా సంస్థల ప్రతినిధులు, ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు ఈ డిజిటల్ విధానాలపై అవగాహన కల్పించి, వారు సులభంగా టికెట్లు పొందేలా సహాయం చేయనున్నారు.
ఈ ప్రతిష్టాత్మక అవగాహన కార్యక్రమంలో
లలితా దేవి సేవా సంఘం,వసుంధర సేవా సంఘం,నారాయణ సేవా సంఘం,శ్రీ వరాహ లక్ష్మీనరసింహ సేవా సంఘం,శ్రీహరి సేవా సంఘం
హరే కృష్ణ జ్వాల నరసింహ సేవా సంఘం
భక్తి సకల దేవతా సేవా సంఘం పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు మరియు సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అత్యంత వివరాత్మకంగా, జరిగిన ఈ అవగాహన సదస్సుపై స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సింహగిరి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, దేవస్థాన ఈవో వారి నిర్ణయాలకు ,ఐటీ విభాగానికి అన్ని విధాలా తాము పూర్తి సహకారం అందిస్తామని, భక్తులకు డిజిటల్ సేవలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తామని సేవా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.
భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ సేవలను భక్తులందరూ వినియోగించుకోవాలని ఆలయ ఇఓ కోరారు.

Comments
Post a Comment