శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం సింహాచలం కొండపై వైభవంగా దేవస్థానం ధర్మకర్మల మండలి ప్రమాణస్వీకారం
సింహాచలం: విశాఖ సందేశం : 21 మే 2026 :శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్మల మండలి (ట్రస్ట్ బోర్డ్) ప్రమాణస్వీకార మహోత్సవం గురువారం కొండపైన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) జల్లేపల్లి వెంకట్రావు నూతన సభ్యులచే శాస్త్రోక్తంగా ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, ఎస్.కోట ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి, మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మరియు నరసాపురం జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆర్. కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ కార్యక్రమానికి వర్చువల్ (ఆన్‌లైన్) ద్వారా హాజరై, నూతన సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం బోర్డు సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రమాణస్వీకారం చేసిన ధర్మకర్మల మండలి సభ్యులు:
శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు (వంశపారంపర్య ధర్మకర్త మరియు చైర్మన్)
శ్రీ మాకేన సీతారాం పాత్రుడు (నవీన్)
శ్రీ కాసిరెడ్డి దామోదర్
శ్రీమతి చలమూరి భారతి
శ్రీ కారక దేవుడు
శ్రీ కనకాల మురళీమోహన్
శ్రీమతి వెంపడాపు అన్నపూర్ణ
శ్రీమతి బీతాల నీరజ లక్ష్మీ కుమారి
శ్రీ మధుపద సన్యాసి రావు
శ్రీమతి డాక్టర్ ధరణి బండ్ల
శ్రీ నీతిపల్లి మహేష్
శ్రీమతి పెద్దిశెట్టి ఉష శ్రీ
శ్రీమతి లలిత జ్యోతి
శ్రీమతి గుత్తికొండ శ్రీలత
శ్రీ సుసరపు గణపతి రావు
శ్రీమతి చల్లాంగి జ్ఞానేశ్వరి
శ్రీ పావులూరి శ్రీనివాస రావు
ఎక్స్ అఫిషియో సభ్యులు:
శ్రీ గూడవర్తి శ్రీనివాస ఆచార్యులు (ఆలయ ప్రధాన అర్చకులు)
ప్రత్యేక ఆహ్వానితులు:
శ్రీ బొక్కం స్వామి నాయుడు
శ్రీ వేదుల దక్షిణామూర్తి
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించి స్వామివారి శేషవస్త్రాన్ని, ప్రసాదాలను బహూకరించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధులత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఇతర సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో అధికారులు, సభ్యుల కుటుంబ సభ్యులు మరియు అభిమానులు పాల్గొన్నారు.
NK.V.SHARMA EDITOR





Comments
Post a Comment