Skip to main content

టీడీపీ కార్యకర్తలే పార్టీకి వెన్నుదన్ను.... కార్యకర్తల త్యాగలే కూటమి చారిత్రక విజయం : ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. అల్లవరంలో అంబరాన్నంటిన టీడీపీ మహానాడు పసుపు సంబరాలు....

 


అల్లవరం, విశాఖ సందేసం....టీడీపీ కార్యకర్తలే పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి ఎన్నికలలో  కార్యకర్తల త్యాగలే కూటమి చారిత్రక విజయం సాధించిందని  ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడు రెండో రోజు వేడుకలు రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్, అల్లవరం మండల టిడిపి అధ్యక్షులు దెందుకూరి సత్తి బాబురాజు ఆధ్వర్యంలో 3- క్లస్టర్ల ఇన్ఛార్జ్లు వేగిరాజు వెంకటరాజు, కడలి వెంకటేశ్వరరావు, బండిగుప్తాపు సత్తిబాబు పర్యవేక్షణలో పండుగ వాతావరణంలో మహానాడు వేడుకలను 


 రెండు రోజులు అత్యంత ఉత్సహంగా సాగాయి. పసుపు పండుగలో భాగంగా  గురువారం మండలంలోని మూడు క్లస్టర్ల మహానాడు సభా వేదికలను అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు,నియోజకవర్గ పరిశీలకులు వనమాడి సుస్మిత ముఖ్య అతిథులుగా పాల్గొని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ సరికొత్త డిజిటల్ పసుపు పండుగలో భాగస్వాములయ్యారు.


యుగపురుషుడు, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకొని, ఆయా క్లస్టర్ల వేదికల వద్ద ఉన్న ఎన్టీఆర్ చిత్రపటానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు  మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయంగా నిలిచిపోయారని, ఆయన ఆశయాల సాధన కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తోందని కొనియాడారు. అనంతరం పార్టీ కోసం దశాబ్దాలుగా జెండా మోస్తూ, అంకితభావంతో పనిచేస్తున్న పలువురు సీనియర్ మరియు ఉత్తమ కార్యకర్తలను ఎమ్మెల్యే ఆనందరావు ప్రత్యేకంగా శాలువాలు కప్పి, ఘనంగా సత్కరించి అభినందించారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, వారి త్యాగాల వల్లే కూటమి చారిత్రాత్మక విజయం సాధించిందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మహానాడును నియోజకవర్గ వ్యాప్తంగా దిగ్విజయం చేసిన కూటమి శ్రేణులందరికీ  పేరు పేరునా ప్రత్యేక   కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్లస్టర్ ఇన్-ఛార్జ్ లు, తెలుగుదేశంపార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నడింపల్లి సుబ్రహ్మణ్యం రాజు, పచ్చిమాల ఏడుకొండలు, సీనియర్ నాయకులు గుబ్బల రాంప్రసాద్, తోట నరసింహారావు, వేగిరాజు శ్రీనివాసరాజు, చింతా శ్రీనివాస్, లూటుకుర్తి చిన్న, యాళ్ల ఈశ్వరరావు,


కడలి వెంకట రమణ, బళ్ళ సత్యనారాయణ, కాకిలేటి సూరిబాబు, పోతుల నాగరాజు,  కడలి కృష్ణ, అధిక సంఖ్యలో టిడిపి నాయకులు కార్యకర్తలు, యువత మహిళలు పాల్గొన్నారు.

              Srinivas Spl Correspondant 

Comments