Skip to main content

ఎన్నికల హామీలు గాలికి వదిలేసి... ధరల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం..... పెట్రోల్,డీజిల్ ధరల పెంపుపై వైస్సార్సీపీ శ్రేణులు భారీ నిరసన.... జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం....



అమలాపురం, విశాఖ సందేసం....అమలాపురం నియోజకవర్గం కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్  ఆధ్వర్యంలో పెట్రోల్,డీజిల్ ధరల పెంపుపై భారీ నిరసన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నడూ లేనివిధంగా పెట్రోలు, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడాన్ని నిరసిస్తూ  


అమలాపురంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రవాణా రంగ కార్మికులు ఈ నిరసనలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆటోను తాడుతో లాగి వినూత్న నిరసన చేపట్టారు. ధరల పెరుగుదలపై ప్రజల్లో మరియు రవాణా రంగ కార్మికుల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తూ, నియోజకవర్గం కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్  స్వయంగా ఆటోను తాడుతో లాగుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోలు, 


డీజిల్ ధరలను తగ్గిస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెద్ద పెద్ద హామీలు ఇచ్చిందన్నారు, పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను కూటమి ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ కూడుపూడి సూర్యనారాయణరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం  అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల  హామీలను పూర్తిగా గాలికి వదిలేసి, ధరలను విపరీతంగా పెంచి  రాష్ట్ర ప్రజల నడ్డి విరుస్తున్నారని  మండిపడ్డారు. మాజీ ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ 


నేడు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక ధరలకు పెట్రోలు, డీజిల్ విక్రయిస్తూ సామాన్య ప్రజలపై, వాహనదారులపై మోయలేని భారాన్ని మోపుతున్నారన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసి, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు

ఈ  నిరసన కార్యక్రమంలో  రవాణా రంగాలు, వై.ఎస్.ఆర్సిపి నాయకులు,అభిమానులు,కార్యకర్తలు,పెద్దఎత్తున పాల్గొన్నారు...

                Srinivas Spl Correspondant 

Comments