వేసవి తీవ్రత దృష్ట్యా జీవీఎంసీ పిజిఆర్ఎస్ లో ప్రజలకు చల్లని తాగునీరు, మజ్జిగ పంపిణీ. * జీవీఎంసీ పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే ప్రజల కోసం చలివేంద్రం ఏర్పాటు. *బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా – వైజాగ్ స్టీల్ సిటీ సెంటర్ సహకారంతో ప్రతి సోమవారం సేవా కార్యక్రమం.
విశాఖపట్నం, మే 18: వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయం నందు పీజీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం మరియు మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ప్రారంభించారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI), ప్రతినిధులు, వైజాగ్ స్టీల్ సిటీ సెంటర్ స్పాన్సర్లు ఏర్పాటు చేసిన చలివేంద్రం కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, పి.నల్లనయ్య, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI), వైజాగ్ స్టీల్ సిటీ సెంటర్ ప్రతినిధులు ఎన్.నాగేశ్వరరావు, పి.అప్పలరాజు లతో కలిసి పిజిఆర్ఎస్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు స్వయంగా చల్లని తాగునీరు, మజ్జిగ ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు ఎండల నుండి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువగా నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. వేసవికాలంలో ప్రతి సోమవారం పిజిఆర్ఎస్ కార్యక్రమముకు విచ్చేసిన ప్రజలు వేసవి తాపానికి గురికాకుండా చల్లని త్రాగునీరు, మజ్జిగ ను ఉచితంగా వారికి అందించడం జరుగునని, వేసవికాలం అనంతరం యధావిధిగా పిజిఆర్ఎస్ లో తాగునీరు, కాఫీ/టీ లు ప్రజలకు పంపిణీ చేయడం జరుగునని కమిషనర్ తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి చల్లని తాగునీరును, మజ్జిగను ఉచితంగా సరఫరా చేస్తున్న బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా – వైజాగ్ స్టీల్ సిటీ సెంటర్ ప్రతినిధులను కమిషనర్ అభినందించారు.
ఈ సందర్భంగా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా – వైజాగ్ స్టీల్ సిటీ సెంటర్ ప్రతినిధులు ఎన్.నాగేశ్వరరావు, పి.అప్పలరాజు మాట్లాడుతూ ప్రతి సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పిజిఆర్ఎస్ కు వచ్చిన ప్రజలకు తాగునీరు మజ్జిగను ఉచితంగా సరఫరా చేస్తామని కమిషనర్ కు తెలుపగా.., కమిషనర్ వారిని అభినందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని వారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వైజాగ్ స్టీల్ సిటీ సెంటర్ ప్రతినిధులు పి హెచ్ కె కిషోర్, ఎ.కాశీ విశ్వేశ్వరరావు, కె.శ్రీనివాస్ రెడ్డి, ఎ.హరి విజయకుమార్, ఉమాపతి, అశోక్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ.

Comments
Post a Comment