Skip to main content

బెండమూర్లంకలో నేషనల్ డెంగ్యూ డే సందర్భంగా ర్యాలీ...


అల్లవరం, విశాఖ సందేసం జాతీయ డెంగ్యూ డేసందర్బంగా అల్లవరం మండలం బెండమూర్లంక పీహెచ్ ఆధ్వర్యంలో బెండమూర్లంక నివారణపై  ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు డెంగ్యూ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి విధానం మరియు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ర్యాలీ పాల్గొన్న  ప్రజలకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వైద్యులు మాట్లాడుతూ  డెంగ్యూ వైరస్ వ్యాధి దోమలు ఎక్కువగా పగటి సమయంలో కుడతాయన్నారు.


జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, కళ్ల వెనుక నొప్పి, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే  వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, కూలర్లు, బకెట్లు, టైర్లు, కొబ్బరి చెక్కలు వంటి వాటిలో నీరు నిల్వ కాకుండా వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవలన్నారు. స్వయంగా మందులు వాడకుండా వైద్యుల సలహా తీసుకోవాలన్నారు. ప్రజలందరూ డెంగ్యూ నివారణలో భాగస్వాములు కావాలని వైద్య సిబ్బంది కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్  సూర్య నగేష్, సూపర్వైజర్ ఎన్.ఎల్.వి. రంగనాధ్, స్టాఫ్ నర్స్ దుర్గ భవాని, ఫార్మసిస్ట్ పుష్ప సత్య , ల్యాబ్ టెక్నీషియన్ స్వామి , హెల్త్ అసిస్టెంట్లు వినయ్, సత్యనారాయణ , సమీప ప్రాంతాల ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

               Srinivas Spl Correspondant 

Comments