అందరూ భాగస్వామ్యూలై ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం : ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు..... ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అందరూ భాగస్వామ్యూలై ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం : ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు..... ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు...
అమలాపురం, విశాఖ సందేసం....ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం విజయవంతం కావాలంటే కేవలం ప్రభుత్వ సిబ్బంది వల్లే సాధ్యంకాదని. పురజనుల భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, చెత్తను రోడ్లపై వేయకుండా మున్సి పల్ వాహనాలకే అందించాలని స్థానిక శాసన సభ్యులు అయితాబత్తుల ఆనందరావు కోరారు.
స్థానిక పట్టణ పరిధిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని శాసనసభ్యులు ఆనందరావు,శాసనమండలి సభ్యులు కుడిపూడి సూర్యనారాయణ, మునిసిపల్ కమిషనర్ నిర్మల కుమార్ సిబ్బందితో స్థానిక పురపాలక సంఘం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలో అన్ని వార్డులలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడమే ధ్యేయంగా నేటి నుండి ప్రతిష్టాత్మక ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రజల ఆరోగ్య రక్షణ లక్ష్యంగా నిర్వహించారు. నగరాల సుందరీకరణే లక్ష్యంగా రాబోయే రోజుల్లో ఈ ప్రత్యేక డ్రైవ్‌ను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రోజువారి ప్రత్యేక డ్రైవులు నిర్వహిస్తూ మున్సిపాలిటీ పరిధిలోని వార్డులను క్లస్టర్లుగా విభజించి, ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి ఉధృతంగా చెత్త సేకరణ మరియు రోడ్ల ఊడ్పిడి పనులు చేపట్టారన్నారు. డంప్పింగ్ యార్డుల తరలింపు బ్లాక్ స్పాట్స్ నిర్మూలన, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, ఖాళీ స్థలాలలో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి, ఆయా ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో దోమల నివారణకు నీరునిలవ కుండా ఉండేందుకు వీలుగా అన్ని ప్రధాన, అంతర్గత మురుగు కాలువల పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తారన్నారు.
కమిషనర్ వి నిర్మల్ కుమార్ మాట్లాడుతూ యాంటీ-లార్వా, ఫాగింగ్ చర్యలు దోమల వృద్ధిని అరికట్టేందుకు ప్రతి వీధి లోనూ రసాయనాల పిచికారీ యాంటీ-లార్వా ఆపరేషన్స్ మరియు సాయంత్రం వేళల్లో ఫాగింగ్ విరివిగా నిర్వహిస్తారన్నారు. తడి-పొడి చెత్త వేరుచేయడంపై అవగాహన కల్పనకై ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్తను విడివిడిగా మున్సిపల్ సిబ్బందికి అందించేలా సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా విస్తృత అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమం కేవలం నామమాత్రంగా సాగకుండా ఉండేందుకు పురపాలక సంఘానికి ఒక ఉన్నతాధికారిని పర్య వేక్షకుడిగా నియమించడం జరిగిందన్నారు. వీరు ప్రతిరోజూ క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తారన్నారు
.లక్ష్యాలను సాధించని లేదా విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పురపాలికల్లో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్' అన్ని పురపాలక సంఘాల్లో మే 22 నుంచి జూన్ 20 వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరిట ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వ హించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీనిలో భాగంగా మొదటి వారంలో అంటే ఈనెల 22 నుంచి 28 వరకు పట్టణాల్లోని అన్ని ముఖ్యమైన రోడ్లను శుభ్రం చేస్తారన్నారు. రోడ్ల మార్జిన్లలో, ఖాళీ ప్రాంతాల్లో చెత్త తొలగించే పనులు చేపడతారన్నారు. 2 వ వారంలో ఈనెల 29 నుంచి జూన్ 4 వరకు అన్ని ప్రధాన డ్రైన్లతో పాటు చిన్న మురుగు కాలువలను శుభ్రం చేస్తారన్నారు. మారుమూల ప్రాంతాల్లోని వీధులను శుభ్రం చేయడం, 3 వ వారంలో జూన్ 5 నుంచి 11 వరకు అన్ని నివాస, వాణిజ్య ప్రదేశాల్లో హోటళ్లు, కల్యాణ మండపాలు, అపార్టు మెంట్లలో చెత్తను తొలగించే పనులు చేపడతారన్నారు అలాగే 4వ వారం జూన్ 12 నుంచి 18 వరకు పట్టణాల్లో చెత్త పేరుకుపో యిన ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేస్తారన్నారు.. ఈ కార్యక్రమంలో బోనం సత్తిబాబు, ఆశెట్టి ఆదిబాబు, ఏడిద శ్రీను, సుదా చిన్నా, భాస్కర్ల రామ కృష్ణ, పురపాలక సంఘ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.ఆనందరావు...
Srinivas Spl Correspondant




Comments
Post a Comment