Skip to main content

వంటెద్దు బాబి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మజ్జిగ చలివేంద్రం....


 అమలాపురం, విశాఖ సందేసం....అమలాపురం      గడియారం స్తంభం సెంటర్ లో కేకేసి రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు అమలాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  వంటెద్దు బాబి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు  కొత్తూరు శ్రీనివాస్ పాల్గొని మజ్జిగ కేంద్రాన్ని  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాటసారులు అధిక సంఖ్యలో పాల్గొని   మజ్జిగను స్వీకరించారు.


 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు  ముషిణి రామకృష్ణారావు, ఏలేశ్వరపు రాధాకృష్ణ, కుడుపూడి శ్రీనివాసరావు, వడ్డీ నాగేశ్వరరావు, యార్లగడ్డ రవీంద్ర, మహబూబ్ షకీలా, దేవరపల్లి రాజేంద్ర బాబు, పులుసుగంటి ప్రకాష్, అప్పన శ్రీరామకృష్ణ, తోపెల్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

              Srinivas Spl Correspondant 

Comments