Skip to main content

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, విశాఖపట్నం జిల్లా "అంతర్జాతీయ ఎయిడ్స్ దీపస్కృత్యాంజలి దినము మరియు ర్యాలీ నినాదం : వారసత్వాన్ని వెలిగించండి: "మేము గుర్తుంచుకుంటాం, మేము అవగాహనతో ముందుకువెళ్తాం, మేము చర్య తీసుకుంటాం"

 


అంతర్జాతీయ ఎయిడ్స్ దీపస్మృత్యంజలి దినము" అనేది 1983 లో ప్రారంభమై ప్రతీ సంవత్సరం మే నెలలో 3వ ఆదివారం కార్యక్రమాన్ని 115 దేశాలలో సుమారు 1,200 కమ్యూనిటీ సంస్థల ద్వారా నిర్వహించబడుతున్నది. 43వ "అంతర్జాతీయ ఎయిడ్స్ దీపస్కృత్యాంజలి దినము ఈ సంవత్సరం వారసత్వాన్ని వెలిగించండి, మేము గుర్తుంచుకుంటాం, మేము అవగాహనతో ముందుకువెళ్తాం, మేము చర్య తీసుకుంటాం అనే నినాదం తో ఈ స్మారక దినాన్ని జరుపుకుంటున్నాము.

ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా HIV/AIDS తో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకు మరియు HIV/AIDS తో జీవిస్తున్న వార్కి మేమున్నాము అనే భరోసా ఇవ్వడం ఈ దినం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సమాజంలో HIV మరియు AIDS గురించి సామాజిక స్పృహను పెంచడానికి, ప్రపంచ వ్యాప్తంగా HIV/AIDS తో నివసించే 38 మిలియన్ల మంది ప్రజలు, "అంతర్జాతీయ ఎయిడ్స్ దీపస్మృత్యంజలి పురస్కరించుకుని ప్రపంచ స్థాయీలో సంఘీభావం తెలపడం, HIV/AIDSతో నివసించే వారి పట్ల కళంకం మరియు వివక్ష యొక్క అడ్డంకులను విచ్ఛిన్నం చేయడం మరియు నూతన తరాలకు సందేశాన్ని అందిస్తారు.

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో HIV/AIDS తో ART సింటర్ నందు గత 20 సంవత్సరలలో సుమారుగా అనేక వేల మంది మరణించడం జరిగింది . ప్రస్తుతం సుమారు 2,34,000 మందికి పైగా ART మందులు వాడుతూ సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వీరికి అన్ని రకాలుగా ఉచిత వైద్య, చికిత్స మరియు ఔషధంలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ద్వారా కల్పించడం జరుగుతున్నది.

విశాఖపట్నం జిల్లాలో సుమారు 26,203 మంది HIV/AIDS తో వున్నట్లు గుర్తించగా వారిలో 11,682 మంది ART మందులు వాడుతున్నారు. గత 20 సంవత్సరలలో వివిధ కారణాలతో 7,445 మంది సుమారుగా మరణించారు. జిల్లా వ్యాప్తంగా 5 ART కేంద్రాలు ఉన్నాయి. పలు స్వచంద సంస్థలు, ప్రభుత్వంలో వివిధ శాఖల ద్వారా వివిధ పథకాల ద్వారా HIV / AIDS తో జీవిస్తున్న వారికి సేవలు అందిస్తునాయి

HIV/AIDS తో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుండి వయా సత్యం జంక్షన్ మీదుగా రామాటాకీస్ వరకు కోవ్వుత్తుల తో ర్యాలీ చెయ్యడం జరిగింది. ఈ యెక్క ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్. పి. జగదీశ్వర రావు వారు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టిబి అదిఖారి, డాక్టర్. రోణంకి రమేష్ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు, పాజిటివ్ నెట్వర్క్ సిబ్బంది, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సిబ్బంది ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సిబ్బంది ఈ యెక్క ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు.


Comments