
ఇక్కడ చిత్రంలో కనిపించే రైలింజన్ పేరు పీఎల్-697. పీఎల్ అంటే పర్లాఖెముండి లైట్ రైల్వే అని అర్థం. అప్పట్లో ఒడిశాలోని పర్లాఖెముండి రాజులు దీన్ని కొనుగోలు చేసి నౌపడ- గుణుపూర్ మధ్య ప్రయాణానికి వినియోగించారు. 20 టన్నుల బరువు కలిగిన ఈ రైలింజిన్ బ్రిటన్లో తయారైంది.
బెంగాల్ నాగపూర్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విశాఖలోని వాల్తేరు డీఆర్ఎం కార్యాలయం వద్ద 1987లో ప్రదర్శనగా ఉంచారు. ప్రస్తుతం వాల్తేరు డివిజన్... విశాఖ డివిజన్గా మారుతున్న నేపథ్యంలో నూతనంగా వస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి హుందాగా స్వాగతం పలుకుతోంది.
Comments
Post a Comment