Skip to main content

బాజపాలో బారీగా చేరికలు బాజపాలో చేరిన సీనియర్ జర్నలిస్ట్ రాపేటి సునీల్ కుమార్


 విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు  పరశురామరాజు సమక్షంలో పార్టీలో చేరిన సీనియర్ జర్నలిస్టు ( విశాఖ జనభేరి ధినపత్రిక ఎడిటర్) 


రాపేటి సునీల్ కుమార్. వారికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్  లంకా దినకర్  పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర మీడియా పేనలిస్ట్ గాజువాక నియోజకవర్గం నాయకులు కరణంరెడ్డి నరసింగరావు ఆహ్వానం మేరకు పార్టీలో చేరారని తెలిపారు.


ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనకు ఆకర్షితులై పార్టీలో చేరానని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షులు పరశురామరాజు , గాజువాక ఇంచార్జ్ కేఎన్ఆర్ సూచనల మేరకు పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో సునీల్ భార్య రాపేటి ఉదయలక్ష్మి, కుమారుడు రాపేటి కీర్తన్ చంద్ర, మరో జర్నలిస్టు యాల్ల అనిల్ కుమార్, సామాజిక కార్యకర్తలు ఆర్ ఎస్. శ్రీకాంత్, ఆర్ ఎస్. దివ్య వాణి, నంబారి సాయి, తదితరులు ఉన్నారు. కేఎన్ఆర్ మాట్లాడుతూ తన ఆహ్వానం మేరకు పార్టీలో చేరిన సునీల్ కుమార్ అనిల్ తదితరులకు అభినందనలు తెలిపారు. కష్టపడి పనిచేసే వారికి బాజపాలో మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు.

Comments