విశాఖపట్నం: వనవాసి కళ్యాణాశ్రమం పిలుపు మేరకు ఆదివాసీలు చేపట్టిన 'చలో ఢిల్లీ' కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ యాత్రను పురస్కరించుకుని విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎం.ఎం.ఎన్. పరశురామరాజు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన జెండా ఊపి ఆదివాసీలతో కూడిన ప్రత్యేక రైలును ప్రారంభించారు.
ఈ సందర్భంగా పరశురామరాజు గారు మాట్లాడుతూ, "ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు మరియు వారి రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మతం మారిన వారికి గిరిజన రిజర్వేషన్లు కొనసాగించడం వల్ల అసలైన ఆదివాసీలకు అన్యాయం జరుగుతోంది. దీనిని అరికట్టడానికే ఈ పోరాటం," అని పేర్కొన్నారు.విశాఖ మరియు అరకు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని వేలాది మంది ఆదివాసీలు రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి బయలుదేరారు.
రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన హక్కులను పరిరక్షించాలని, ప్రధానంగా మత మార్పిడికి గురైన వ్యక్తులను ఎస్టీ (ST) జాబితా నుండి తొలగించాలని (De-listing) ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం.ఈ నెల 24వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీలతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో Rss సహ ప్రాంత ప్రచారక్ జనార్ధన్ జీ, Rss మహానగర సంఘ చాలక పీవీపీ నారాయణరావు, విశ్వహిందూ పరిషత్ బాబ్జి గారు,వనవాసి కళ్యాణాశ్రమం ప్రతినిధులు,గిరిజన నాయకులు మరియు బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
K.V.SHARMA EDITOR




Comments
Post a Comment