చాగంటి
ఒక గరికపాటి
ఒక సామవేదం
ఒక చిన జియర్ స్వామి
ఒక వడ్డిపర్తి పద్మా కర్
బ్రాహ్మణ్ అన్నా
బ్రాహ్మణత్వం అన్నా
అందరికీ గుర్తుకు
వచ్చేది పైన నేను
పేర్కొన్న ఐదుగురే
ముందు వరుస లో
ఉంటారు. వారిని సద్
బ్రాహ్మణులు
అనవచ్చు.
బ్రాహ్మనేతరులకు
కూడా వారంటే
ఇష్టమే.
వారిలో కాన
వచ్చేది వేరెవ్వరిలో
ఆగపించదు.
అదే భక్తి భావం,
సేవా భావం,
పరోపకారం,
నిబద్దత,
నిజాయితీ,
ధర్నాచరణ,
సమాజ స్పృహ
ఇత్యాదివి.
వారి నోటినుంచి
విలువడే ప్రతీ
మాటలో అర్ధం,
పరమార్ధం
ఇమిడి ఉంటాయి.
ఒక టీ దుకాణ
దారుడు దగ్గర
నుంచి కారు,
ఆటో డ్రైవర్,
కూలి నాలి
చేసుకుని
జీవించే వారి
వరకూ శ్రీ
చాగంటి వారి
ప్రవచనం తో
తెల్లారుతుంది.
అలా నేటి
సామాన్యుడు
ఆకర్షి తుడవుతున్నాడు
అనడం అతిశయోక్తి
కాదు. వారి మాట
తీరు అలాంటిది.
సమాజ హితులు,
దైవాంశ సంభూ తులు,
ఇంకా చెప్పాలంటే
దేవ దూతలు.
మన పాలకులు
కన్నా వీరి మాటలు
మిన్న అని అనిపించక
మానదు, ఎవరికన.
దినపత్రిక చూద్దాము
అన్నా News ఛానల్
చూద్దాం అన్నా
పాలక పక్షం పై
ప్రతి పక్షం,
ప్రతి పక్షం పై
పాలక పక్షం
విమర్శలు,
ప్రతి విమర్శలు
తప్ప పాలనా
అంశాలు ఎవరి లో
కానరావు.
పెట్రోల్, డీజిల్
ధరలు ఒక్కసారే
లీటరుకి ఏడెనిమిది
రూపాయలు
పెరగడం తో
వాటి ప్రభావం
నిత్య అవసరాల
మీద పడింది.
I.T. Coms లో
ఉపాధి అవకాశాలు
తగ్గు ముఖం
పట్టాయి,
జనాలలో
కొనుగోలు శక్తి
క్రమంగా తగ్గుతూ
సొంత ఇంటి
కల నెరవేరక
కొందరు, EMI
కట్ట లేక మరికొందరు
ఆర్ధిక సంక్షోభం
లో కొట్టుమిట్టాడు
తున్నారు.
అమ్మకాలు,
కొనుగోళ్లు
జరగక రియల్
ESTATE వ్యాపారస్థులు,
BANKERS
లబో, దిబో
మంటున్నారు.
మరో ప్రక్క
ట్రంప్ అమెరికా
వీసాలపై ఆంక్షలు,
యుద్ధ వాతావరణం
చల్లారే టట్లు లేదు.
LPG గ్యాస్
అందుబాటులో
లేక కొరత కారణం
గా అన్ని తిను
బండారాల ధరలు
ఆకాశాన్ని అంటి
ఎవరికీ చెప్పు
కోలేని పరిస్థితి
నేటి సామాన్యుడి
స్థితి అని చెప్పొచ్చు.
మన 'నమో' గారేమో
బంగారం
కొనద్దు అంటారు
మొదటి డానికి
మొగుడు లేడు,
కడ దానికి కళ్యాణం
అన్నట్టు ఉంది వారి
తీరు. అసలు నిత్య
అవసరాలు
సామాన్యుడు
కొనుగోలు శక్తి
కోల్పోయి సతమత
మవుతున్న తరుణం లో
బంగారం కొనొద్దు
అనడం లో
అంతరార్ధం ఏమిటో
అర్ధం కావడం లేదు.
నేటి మన పాలకులు
యుద్ధం బూచి పేరు
చెప్పి సామాన్యుడి తో
దోబూచు లాడు
కుంటున్నారు అన్నది జగద్విదితం.
ఎవరి ఎత్తు
గడలు వారివి.
ఎవరి వ్యాపార
ధోరణి వారిది,
నడుమ సామాన్యుని
గోడు ఎవరికి
పట్టదు.
ఇదే మన
ప్రజాస్వామ్యం
ఇదే మన స్వతంత్ర
భారత దేశం..
Dr. నండూరి రామకృష్ణ
Sr Sub EDITOR
25.05.2026

Comments
Post a Comment