Skip to main content

రైతులకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు వెన్నెముకలుగా నిలవాలి : ఎంపీ హరీష్ మాధుర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు రైతులకు మరింత చేరువకావాలి.... అమలాపురంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం...


అమలాపురం, విశాఖ సందేసం
.... డా. బిఆర్  అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో కోనసీమ జిల్లా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల అధ్యక్షులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల అధ్యక్షులు, బ్యాంకు ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు.


ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రైతులకు సరైన సమయంలో రుణ సదుపాయాలు అందించడం ద్వారా వ్యవసాయ రంగం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు వెన్నెముకలుగా నిలుస్తున్నాయని, రైతులకు మరింత చేరువగా పనిచేసి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హ రైతుకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ సొసైటీల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రైతులు గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను సమర్థవంతంగా వినియోగించుకుని వ్యవసాయాభివృద్ధితో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. డిపాజిట్లు పెంచడం, షేర్ క్యాపిటల్‌లో భాగస్వామ్యం కావడం ద్వారా సొసైటీల బలోపేతానికి రైతులు సహకరించాలని కోరారు.ఈ సందర్భంగా ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ రైతు సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రతి రైతుకు చేరేలా సొసైటీ అధ్యక్షులు కృషి చేయాలని సూచించారు. బ్యాంక్ సీఈఓ ప్రవీణ్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల నిర్వహణ, పంట రుణాలు, డిపాజిట్ల పెంపు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై అధ్యక్షులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి మెట్ల రమణబాబు డీసీఎంఎస్ చైర్మన్ పేచ్చేటి చంద్రమౌళి, అముడా చైర్మన్ చైర్మన్ అల్లాడి సోంబాబు, టీడీపీ నాయకులు ఆత్మ చైర్మన్ చిక్కం సుధా, జనసేన నాయకులు బండారు శ్రీనివాస్, పోలిశెట్టి చంద్రశేఖర్, బీజేపీ నాయకులు సత్యనారాయణ, యాళ్ల దొరబాబు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, సాకూరు సొసైటీ చైర్మన్ నల్ల వెంకటేశ్వరం, కంకిపాటి  గోపి, పోలిశెట్టి బాబులు, కనుకుడి రమేష్, కలవకొలను  తాతాజీ, యాళ్ల సతీష్, అకెళ్ళ సూర్యనారాయణ మూర్తి, అయితాబత్తుల ఉమా, ఇసకబట్ల రవిబాబు, తదితరులు పాల్గొన్నారు.

            Srinivas Spl Correspondant 

Comments