Skip to main content

ఎన్టీఆర్ సేవలు అజరామరం* *... ఘన నివాళి అర్పించిన గంట్ల శ్రీనుబాబు*


విశాఖపట్నం మే 28*: దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు సేవలు ఆజరామరమని జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి డాక్ యార్డ్, కే టి బి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


గంట్ల శ్రీనుబాబు అన్నారు. ఎన్టీఆర్ 13వ జయంతి సందర్భంగా నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజల కోసం రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని అందించడంతోపాటు, పెన్షన్ల పథకాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలందరికీ అన్ని రకాల సదుపాయాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన సేవలను నేటి తరం పాలకులు, ప్రజాప్రతినిధులు  ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

Comments