Skip to main content

మాజీ ఎమ్మెల్యే, గౌరవ పెద్దలు ఎస్ . ఎ. రెహమాన్ గారి జన్మదిన వేడుకలో పాల్గొన్న సౌత్ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*


మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉడా చైర్మన్ , గౌరవ పెద్దలు డాక్టర్ రెహమాన్ గారికి  దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు జన్మదిన శుభాకాంక్షలు  తెలియజేశారు. పూర్ణా మార్కెట్ ,క్రాంతి థియేటర్  ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో  పుష్పగుచ్ఛం అందించి, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.  కేక్ కటింగ్ అనంతరం ఎమ్మెల్యే  వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, ప్రజాసేవలో మాజీ ఎమ్మెల్యే , గురువర్యులు రెహమాన్  గారి అనుభవం, సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత సేవ చేసే శక్తి, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ  ఇంచార్జి సుధాకర్ గారు, జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివప్రసాద్ రెడ్డి గారు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని మాజీ ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు...

Comments